కల్లు దుకాణాలపై ఈగల్ టీం దాడులు.. 45 బాక్సుల కల్లు సీసాలు స్వాధీనం!
తూప్రాన్, సెప్టెంబర్ 10: మెదక్ జిల్లా తూప్రాన్‌లో కల్లు దుకాణాలపై ఈగల్ టీం ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అక్కడ కల్లు సేవిస్తున్న వినియోగదారులకు డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నలుగురికి డ్రగ్ పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు గుర్తించారు. కల్లు డిపోలోనూ ఈగల్ టీం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 45 బాక్సుల కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కల్లు నాణ్యత, అందులో నిషేధిత మాదక…