Headlines

కామెడీ సినిమా చేయాలంటే నిజంగా అంత కష్టపడుతున్నారా..?

ఒకప్పట్లా తెలుగులో కామెడీ సినిమాలు ఇప్పుడెందుకు రావట్లేదు..? అల్లరి నరేష్ లాంటి హీరోలు కూడా ఎందుకు కామెడీ వదిలేసి సీరియస్ బాట పడుతున్నారు..? హిలేరియస్ కథలు మన రైటర్లు రాయలేకపోతున్నారా లేదా ఏ కామెడీ చేసినా వివాదానికే దారి తీస్తుందా..? ఇలాంటి సమయంలోనూ ఆ ఒక్క దర్శకుడు మాత్రమే ఎలా ఎంటర్‌టైన్మెంట్‌తో నెట్టుకొస్తున్నారు..? తెలుగులో కామెడీ సినిమాలు ఒకప్పుడు రాజేంద్రప్రసాద్.. ఆ తర్వాత అల్లరి నరేష్ పేర్లే గుర్తుకొస్తాయి. అయితే కొన్నేళ్లుగా ఒకప్పట్లా ఎంటర్‌టైన్మెంట్ సినిమాలు రావట్లేదు….

Read Full News

తాత ముత్తాతలు సాయంత్రం వేళా చెట్టు కింద కూర్చొని వీటినే తినేవాళ్లు.. ఒంటికి భలే చలువ

శెనగపప్పు వడలకు కావాల్సిన పదార్ధాలు: రెండు కప్పుల శెనగపప్పు , బియ్యపు పిండి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి, బంగాళాదుంప, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అల్లం పేస్ట్, అల్లం, మూడు కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, అర టేబుల్ స్పూన్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, వడలను కాల్చడానికి నూనెను తీసుకోవాలి. శెనగపప్పు వడల తయారి విధానం : ముందుగా ఒక కప్పు శెనగపప్పును తీసుకుని నానబెట్టుకుని వీటిని తీసుకోవాలి. ఆ…

Read Full News

రోజూ అరటిపండు తింటే ఏమవుతుంది..? గుండె ఆరోగ్యం నుంచి జీర్ణక్రియ వరకు ఎన్నో ప్రయోజనాలు!

గుండె ఆరోగ్యానికి మేలు.. అరటిపండ్లలో సమృద్ధిగా ఉండే పొటాషియం శరీరంలో సోడియం సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడంలో సహాయపడటంతో పాటు గుండె పనితీరుకు కూడా తోడ్పడుతుంది. ద్రవ సమతుల్యతకు తోడ్పాటు.. శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను నిర్వహించడంలో పొటాషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాల సాధారణ పనితీరుకు కూడా పొటాషియం అవసరం. అయితే మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నవారిలో పొటాషియం శరీరంలో అధికంగా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల కిడ్నీ…

Read Full News

కరువు పరిస్థితుల్లో అండగా నిలిచే సెప్టెంబర్ నెల పంటలు.. తక్కువ నీటితో ఎక్కువ లాభాలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపింది. నైరుతి రుతుపవనాలు తీవ్రంగా నిరాశపరచడంతో వర్షాకాలం సగం గడిచిపోయినా తగినంత వర్షం లేదు. ఈ పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎంతో మంది రైతులు కనీసం విత్తనాలు కూడా వేయలేకపోయారు. ప్రస్తుతం ఆగస్టు చివరి రోజుల్లో ఉన్న మనం, సెప్టెంబర్ నెలలో తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా ఈ…

Read Full News

Bank Rules: రుణం తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే. హామీ సంతకం పెట్టిన వ్యక్తి చెల్లించాల్సిందేనా..? బ్యాంక్ రూల్స్ ఇవే..

తమ ఆర్ధిక అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం కొంతమందికి తప్పనిసరి అవుతుంది. రుణం కోసం తమ ఆస్తులు తాకట్టు పెట్టడంతో పాటు హామీదారుడి సంతకాలు పెట్టించాల్సి ఉంటుంది. హామీ సంతకం పెట్టడానికి చాలామంది ముందుకు రారు. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోతే ఆ బాధ్యత తమ మీద ఉంటుందనే ఉద్దేశంతో హామీ సంతకం పెట్టడానికి జంకుతుంటారు. దీంతో పాటు క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుందని భయపడుతుంటారు. రుణగ్రహీత చెల్లించకపోతే హామీదారుడి సిబిల్…

Read Full News

Blood Pressure Control: బీపీ ఉన్నవారికి వరం ఈ పండు.. మీ డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే!

అరటిపండులో పొటాషియంతో పాటు పీచు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో సోడియం ఎక్కువగా ఉండటం రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. పొటాషియం సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో, అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీంతో రక్తనాళాలపై ఒత్తిడి తగ్గేందుకు, రక్తప్రసరణ సజావుగా సాగేందుకు మద్దతు లభించవచ్చు. అయితే అరటిపండు తినడం ఒక్కటే అధిక రక్తపోటుకు చికిత్స కాదు. బీపీ మందులు వాడుతున్న వారు వాటిని ఆపకుండా, వైద్యుల సూచనలను పాటిస్తూ ఆహారంలో మార్పులు…

Read Full News

జామ తోటలో పండు ఈగ పనిపట్టే నేచురల్ ట్రాప్..

జామ సాగులో లాభదాయకమైన దిగుబడులు సాధించాలంటే.. నేల ఆరోగ్యం, తెగుళ్ల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. తక్కువ ఖర్చుతో కూడిన, సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా ఈ రెండు అంశాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ముఖ్యంగా, సేంద్రీయ ఎరువు తయారీ, పండు ఈగ నివారణకు సరళమైన ట్రాప్ పద్ధతులను ఈ కథనంలో తెలుసుకుందాం. సేంద్రీయ ఎరువు తయారీ: భూసార పెంపునకు కీలకమైన అడుగు మొక్కలు నాటిన తొలి మూడు నెలల వరకు ఎటువంటి అదనపు ఎరువులు ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు….

Read Full News

ఏటూరునాగారం అడవుల్లో అరుదైన పాము.. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా?

Banded Krait Telangana: ఏటూరునాగారం అడవుల్లో అరుదైన పాము ప్రత్యక్షమైంది. తెలంగాణ అడవుల్లో ఇలాంటి చారలు కలిగిన పాము ప్రత్యక్షం కావడం ఆందోళన గురిచేస్తుంది. నలుపు- పచ్చటి చారకలతో ఉన్న ఆ పాము కాటుకు గురైతే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. ఏటూరునాగారం శివారు అడవుల్లో ఈ పాము ప్రత్యక్షమైంది. రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న పామును చూసి బాటసారులు ఆందోళన చెందారు. పసుపు – నలుపు చారలు కలిగిన ఇలాంటి…

Read Full News

ముద్ద ముద్దలో ఈ రోటీ పచ్చడి.. ఒక్కసారి తింటే చికెన్, మటన్‌ను మర్చిపోతారంతే..!

Andhra Style Brinjal Sesame Chutney: సాంప్రదాయ తెలుగు వంటకాలలో వంకాయ నువ్వుల రోటి పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆహారాన్ని మరింత తృప్తినిచ్చేలా చేస్తుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి ఇచ్చే అనుభూతి వర్ణనాతీతం. ఈ రెసిపీని సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు, రోటి పచ్చడి ప్రియులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. తయారీకి కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు, నూనె: 7-8…

Read Full News

సెంచరీకి చేరువలో సిరాజ్ మియా..! బుడ్డోడి దెబ్బకు మైండ్ దొబ్బినట్టు ఉందిగా..

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. దేశవాళీ క్రికెట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీ విజేతగా నిలిచేందుకు ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు పోటీ పడుతున్నాయి. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. ప్రస్తుతానికి అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు 79 ఓవర్ల ఆట జరగ్గా.. ఈస్ట్ జోన్ 4 వికెట్లు కోల్పోయి…

Read Full News