Headlines

ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి.. ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు!

వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది: రాస్ప్‌బెర్రీస్‌లో ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలు దెబ్బతినకుండా రక్షించడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గింపునకు: ఈ పండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో రాస్ప్‌బెర్రీస్…

Read Full News

వర్షాలు కరువై.. పంటలు ఎండిపోతున్న వేళ.. తెలంగాణలో నీటిపై రాజకీయ సమరం!

తెలంగాణ వ్యవసాయం ఇప్పటికీ వానపై చాలా వరకు ఆధారపడి ఉంది. నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చే వర్షాలే చెరువులను నింపాలి. వాగులు, వంకల్లో నీరు పారాలి. భూగర్భ జలాలు పెరగాలి. బోర్లలో నీరు ఉండాలి. ప్రాజెక్టులకు నీరు చేరాలి. అప్పుడే రైతు పొలంలో పంట నిలబడుతుంది. కానీ ఈసారి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తేడాగా ఉంది. ఒకవైపు వర్షం తక్కువగా పడుతోంది. మరోవైపు పడిన వాన కూడా ఒకే ప్రాంతంలో కురుస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు…

Read Full News

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో మళ్లీ ట్రోఫీ రచ్చ తప్పదా?.. నఖ్వీ రాకతో టీమిండియాకు కొత్త టెన్షన్

Asia Cup 2026: 2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ముగిసి దాదాపు ఏడాది కావోస్తున్నా నాటి విజయవంతమైన ట్రోఫీ ఇప్పటివరకు టీమిండియా చేతికి దక్కలేదు. నాడు ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా బహుమతి తీసుకోవడానికి భారత జట్టు సున్నితంగా నిరాకరించింది. ఆ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నఖ్వీ, ట్రోఫీని నేరుగా వేదిక నుంచి…

Read Full News

FD vs Mutual Funds: FD కంటే ఎక్కువ రాబడి కావాలా? స్టాక్ మార్కెట్‌కు భయపడేవారు ఈ ఫండ్స్ గురించి తెలుసుకోండి!

స్వల్పకాలిక అవసరాల కోసం ఉంచిన డబ్బును అధిక రిస్క్ ఉన్న ఈక్విటీ పెట్టుబడుల్లో పెట్టడం సరైనది కాకపోవచ్చు. అదే సమయంలో 7 నుంచి 15 సంవత్సరాల వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారు మార్కెట్ ఆధారిత పెట్టుబడులను పరిశీలించవచ్చు. లిక్విడ్, ఓవర్‌నైట్ ఫండ్స్ వంటి డెట్/మనీ మార్కెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్ కేటగిరీలు స్వల్పకాలికంగా అదనపు డబ్బును పార్క్ చేయాలనుకునే వారికి ఉపయోగపడే ఎంపికలుగా పరిగణించబడుతున్నాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా డిపాజిట్ లేదా గ్యారెంటీడ్ రిటర్న్ ఉత్పత్తులు…

Read Full News

పాన్ ఇండియాన్ సినిమాలతో నిజంగా నిర్మాతలకు డబ్బులు వస్తున్నాయా?

ప్యాన్ ఇండియా చిత్రాలు భారీ అంచనాలతో విడుదలవుతున్నప్పటికీ, అవి నిజంగా తమ పేరుకు తగ్గ కంటెంట్‌ను అందిస్తున్నాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో మ్యాజిక్ సృష్టించలేకపోతున్నాయి. ఒక్కో సినిమా కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. దీనికి విరుద్ధంగా, తక్కువ సమయంలో పూర్తయ్యే రీజనల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు సాధిస్తున్నాయి.వేల మంది శ్రమ, వందల కోట్ల పెట్టుబడి, రెండు…

Read Full News

‘ఆ మంత్రమే బతికించింది’..9 రోజులకు..నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు రెస్క్యూ!

రెస్క్యూ టీమ్స్ బురదను తొలగించి, టన్నెల్ సందు గుండా  మెకానికల్ ఫోర్‌మన్ సంజయ్ షా, మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్ ను బయటకు తీసారు. 9 రోజుల చీకటి నరకం నుంచి ప్రాణాలతో బయటపడడంపై సంజయ్ షా మాట్లాడారు. “రెస్క్యూ సిబ్బంది నన్ను రక్షించినప్పుడు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది నాకు పునర్జన్మ” అని భావోద్వేగానికి గురయ్యారు. కబీర్ మహర్జన్ ఆరోగ్యస్థితి క్షీణించడంతో ఆయనను హెలికాప్టర్‌లో కాట్మండు సైనిక ఆసుపత్రికి తరలించగా, సంజయ్ షా స్థానిక…

Read Full News

పగలు ఆర్‌ఎంపీ డాక్టర్‌.. రాత్రయితే..

పగటిపూట తెల్లకోటు వేసుకొని వైద్యం చేస్తాడు. రాత్రయితే మాత్రం ఇతగాడి కథే వేరుగా ఉంటుంది. డాక్టర్ ముసుగులో అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడి బాగోతం బట్టబయలైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం దూసరిపాము గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన మడగల శ్రీనివాస్ అనే యువకుడు స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. వైద్యుడిగా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా గ్రామంలో అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఇదే…

Read Full News

వీధి కుక్కల స్వైర విహారం.. కుక్క దాడిలో ఎద్దు మృతి.. రైతు ఆవేదన!

సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు కేవలం మనుషులపైనే కాకుండా, పాడి పశువులు మరియు జీవాలపై కూడా దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా సదాశివపేట మండలం ముబారక్‌పూర్ (ఎ) గ్రామంలో వీధి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఒక ఎద్దు మృత్యువాత పడింది. ఈ ఘటన స్థానిక రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముబారక్‌పూర్ (ఎ) గ్రామానికి చెందిన రైతు మన్నే సత్తయ్య తన పొలం…

Read Full News

ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ మార్కెట్‌ను కుదిపేసేందుకు వస్తున్న అద్భుతమైన బైక్ ఏంటి?

సాధారణ ప్రయాణాలకు భిన్నంగా స్పోర్టీ లుక్‌తో పాటు అత్యుత్తమ వేగాన్ని అందించే లక్ష్యంతో ఆంపియర్ సంస్థ ఈ నూతన జైబర్ ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ అద్భుతమైన మైలేజీని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విశేషాలను తెలుసుకుందాం. స్ట్రీట్‌ ఫైటర్ లుక్ ఈ ఆంపియర్ జైబర్ డిజైన్ అత్యంత ప్రత్యేకంగా ఉండగా పేటెంట్‌లో కనిపిస్తున్న రూపాన్ని బట్టి కాన్సెప్ట్‌లో ఉన్న…

Read Full News

Beauty Tips: వారానికి 2 సార్లు ఈ ఫేస్‌ ప్యాక్ అప్లై చేస్తే.. మీ అందం చూసి పక్కవాళ్లే కుళ్లుకోవాలి!

ఏజ్ పెరిగే కొద్ది ఫేస్‌పై ముడతలు, ఫైన్ లైన్స్, చర్మం వదులుగా మారడం సహజం. ఈ సమస్యను తగ్గించుకోవడానికి, యవ్వనంగా కనిపించడానికి జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్స్‌ను వాడుతుంటారు. కానీ మన కిచెన్‌లో దొరికే రెండు పాదార్థాలను వాడి ఈజీగా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం. పురాతన కాలం నుంచి చర్మ సౌందర్యానికి ముల్తానీ మట్టి, బంగాళాదుంప రసంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది వదులుగా మారిన చర్మాన్ని…

Read Full News