
MGBS బస్టాండ్ తాత్కాలిక మూసివేత..! బస్సుల రాకపోకలు రద్దు..
హైదరాబాద్, సెప్టెంబర్ 27: హైదరాబాద్ MGBSను మూసీ వరద చుట్టుముట్టిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన వెలువరించారు. మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోందని సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు….