
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా ప్రాంతం, చంబా చౌగాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రాంలీలా నాటక ప్రదర్శన సందర్భంగా ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల అనుభవజ్ఞుడైన నటుడు అమరేష్ మహాజన్, దశరథ మహారాజు పాత్రలో నటిస్తుండగా వేదికపై కుప్పకూలి మరణించారు. గత 25 ఏళ్లుగా ఈ రాంలీలా నాటకాల్లో నటిస్తూ వస్తున్న అమరేష్ మహాజన్, దశరథుడు, రాముడి పాత్రలకు పెట్టింది పేరుగాంచారు. వయసు పైబడినప్పటికీ, ఆయన ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంతో ఈ ప్రదర్శనలో పాల్గొనేవారు….