
తిరుమల బ్రహ్మోత్సవాల్లో గోల్డ్ మ్యాన్ వీడియో
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలగిరులు భక్తజన సందరంగా మారాయి. తిరువీధుల్లో మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే గోల్డ్ మ్యాన్‌గా పేరొందిన విజయ్ కుమార్ కూడా శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ అయిన విజయ్ కుమార్, మెడలో భారీ గొలుసులు, చేతులకు కడియాలు, ఉంగరాలతో సహా ఒంటిపై దాదాపు ఆరు కిలోల బంగారాన్ని ధరించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరిన్ని…