
విమానం ల్యాండింగ్ గేర్లో దాక్కున్న 13 ఏళ్ల బాలుడు.. ఎంత దూరం ప్రయాణించాడో తెలిస్తే..
ఇది ఒక అద్భుతం వంటిది. నమ్మశక్యం కానిది, ఎవరూ ఊహించలేనిది… విమానయాన చరిత్రలోనే ఇలాంటి స్పెషల్ కేసు గురించి మీరు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. కాబూల్ నుండి ఢిల్లీకి వచ్చిన KAM ఎయిర్ విమానం RQ-4401 ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు దాక్కున్నాడు. విమానం ఆదివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాక, అక్కడ బాలుడిని విమాన సిబ్బంది గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగినప్పుడు…