
విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఆప్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన బాలుడు
కేఏఎం విమానయాన సంస్థకు చెందిన విమానం ఆదివారం అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరింది. దాదాపు రెండు గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకుంది. అయితే ప్రయాణికులు, సిబ్బంది అంతా దిగిపోయాక.. బాలుడు మాత్రం విమానం వద్దే తచ్చాడుతూ కనిపించాడు. సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అతడిని అదుపులోకి తీసుకుంది. అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు, నీవు ఎవరితో ఇక్కడకొచ్చావంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బాలుడు తాను అఫ్గాన్‌లోని కుందూజ్ నగర్‌కు చెందిన వాడినని చెప్పగా షాక్ అయ్యారు….