Headlines

అమెరికాలో మంటల్లో విమానం..ఐదుగురు మృతి.. వీడియో ఇదిగో!

ప్యూర్టోరికో నుంచి వచ్చిన ఒక విమానం మయామి విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో రన్‌వేపై అకస్మాత్తుగా అదుపుతప్పింది. నియంత్రణ కోల్పోయిన అమెజాన్ కార్గో విమానం రన్‌వే పక్కనే ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లి అక్కడ తిరుగుతున్న వాహనాలను తీవ్రంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే  విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి.  స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మయామీ ఎయిర్…

Read Full News

ఇవి రెండు గుప్పెళ్ళు తింటే.. కంటి సైట్ తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడు లేని కంటి చూపు మీ సొంతం

నల్ల నువ్వులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మనకి రెండు రకాల నువ్వులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూరల్లో కూడా వేస్తారు. ఇవి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ నల్ల నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రెండు గుప్పెళ్ళు తింటే మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. నల్ల నువ్వులు కంటికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పోషక విలువల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది….

Read Full News

Asia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. కెప్టెన్ చమారి అటాపట్టు…

Read Full News

‘UPSC ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న వద్దంటే అదే వచ్చింది..’ IAS కృష్ణ తేజ ఇచ్చిన సమాధానానికి టాప్‌ ర్యాంక్‌!

హైదరాబాద్, సెప్టెంబర్ 4: అసలు UPSC ఇంటర్వ్యూకు ముందు కృష్ణ తేజ హైదరాబాద్‌లో ఓ మాక్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆయన గుంటూరు జిల్లాకు చెందినవారు కావడంతో.. ఇంటర్వ్యూ ప్యానెల్ పొగాకు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ‘గుంటూరు పొగాకుకు ప్రసిద్ధి కదా.. సిగరెట్ తాగడం సరైనదా? తప్పా?’ అని ప్రశ్నించింది. అందుకు ఆయన సిగరెట్ తాగడం తప్పని సమాధానం ఇచ్చారు. అయితే ప్యానెల్ సభ్యులు దానిని వ్యక్తిగత హక్కుగా సమర్థిస్తూ వాదనకు దిగారు. దీంతో దాదాపు అరగంట పాటు మాక్…

Read Full News

ప్రకృతికే ప్రాణం పోశాడు.. 3 నెలల కష్టంతో మురికి కూపంగా మారిన నది రూపాన్నే మార్చేశాడు..

పిచ్చి పిచ్చి పనులు చేస్తే కాదు.. 10 మందికి ఉపయోగపడే పనిచేస్తే ఫేమ్ అనేది వద్దన్నా వస్తుందని మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ కుర్రాడు నిరూపించాడు. విద్యార్థి అయిన 20 ఏళ్ల బిట్టు స్థానికంగా ఉన్న ఓ నదిని చూసి చలించి పోయాడు. ఎలాగైనా దాన్ని పూర్తిగా క్లీన్ చేయాలని సంకల్పించాడు. అయితే తనతో యంత్రాలు కొనే స్తోమత లేక పోవడంతో నేరుగా చేతులతోనే చెత్తను తీయడం స్టార్ట్ చేశాడు. దాదాపు మూడు నెలల పాటు కష్టపడి…

Read Full News

ఆకలి తీరుస్తున్న ఆహారం ప్రాణం తీస్తుందా? భయం గుప్పిట్లో నేపాల్

ప్రస్తుతం వరద బాధితులంతా తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. బాధితులకు ‘రిలీఫ్ కార్డులు’ ఇచ్చి బియ్యం, పప్పులు, రొట్టెలు, మంచినీళ్ల బాటిళ్లు ఇస్తున్నారు.  ఉచిత సరకుల కోసం ప్రతిరోజూ జనం వరద తెచ్చిన బురద మధ్య బారులు తీరి నిలబడాల్సి వస్తోంది. మరోవైపు, ఇళ్ల శిథిలాల మధ్య ఎక్కడ చూసినా శవాలు  కుప్పలుగా కళ్లెదుటే కనిపిస్తూ కలవరపెడుతున్నాయి . దీంతో ఈగలు, పురుగులు పెరిగి అంటువ్యాధులు వ్యాపిస్తాయేమోనని జనం భయంతో వణికిపోతున్నారు.  మరో వైపు అంటువ్యాధులు ప్రబలే…

Read Full News

దారుణం.. ఇంటి నుంచి దుర్వాసన.. అనుమానంతో తెరిచి చూడగా.. ఫ్రిజ్‌లో తల, చేతి వేళ్లు..!

అస్సాంలో వెలుగుచూసిన ఓ దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గౌహతిలో కొద్ది నెలల క్రితమే వివాహమైన 25 ఏళ్ల యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని ఛిద్రం చేసి, తలను వేరు చేసి ఫ్రిజ్‌లో ప్లాస్టిక్ సంచిలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వేళ్లను కూడా కోసిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని రియా తలుక్దార్ గోస్వామిగా గుర్తించారు. ఆమె…

Read Full News

El Nino: రైతన్నలకు శాపంగా మారిన ఎల్‌నీనో.. వర్షాలు లేక నల్గొండలో నెర్రెలు వారిన నేలలు..

సాధారణంగా వానకాలం సీజన్‌లో ఈ సమయానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పచ్చని పైర్లతో కళకళలాడాలి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాల్లో నీటి కొరత మొదలైంది. నిన్నటి వరకు పచ్చగా కనిపించిన మడి, ఇవాళ తడారిపోయి కనిపిస్తోంది. ఒక్కో మడి చొప్పున ఎండిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాగు విస్తీర్ణం తగ్గినా.. పెరిగిన అన్నదాతల కష్టాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాన కాలంలో19.41 లక్షల ఎకరాల…

Read Full News

ఛీ.. ఛీ మరీ ఇంతకు దిగజారాలా? లోన్ కట్టలేదని.. బాధితురాలి 10వ తరగతి కూతురి ఫోటోలతో..

హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. లోన్ ఈఎంఐ టైంకి కట్టలేదన్న నెపంతో లోన్ యాప్ నిర్వాహకులు దారుణానికి ఒడిగట్టారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ ఓ మహిళపై ఒత్తిడి తేవడమే కాకుండా, పదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి తీవ్ర వేధింపులకు గురిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ రాజలింగం కాలనీకి చెందిన ఓ మహిళ తన బంధువు అవసరాల నిమిత్తం ఓ లోన్…

Read Full News

టీనేజర్లే టార్గెట్‌గా నిషేదిత మందుల విక్రయాలు.. మెడికల్ షాప్‌లపై TG-SAFE ఉక్కుపాదం!

టీనేజర్లను టార్గెట్‌ చేసుకుని అలవాటు చేసే మందులను అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ ఫుడ్‌, ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (TG-SAFE), ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారంలోని ఓ మెడికల్‌ షాపులో గురువారం నిర్వహించిన తనిఖీల్లో టాపెంటాడాల్‌ మాత్రల నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాజులరామారంలో ఉన్న మనా ఫార్మసీ అండ్‌ జనరల్‌ స్టోర్‌ నిర్వాహకుడు పరిసర ప్రాంతాల్లోని టీనేజర్లకు అలవాటు చేసే డ్రగ్‌గా పేరున్న టాపెంటాడాల్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులకు…

Read Full News