Headlines

పెళ్లికి ముందు నెల రోజుల పాటు ఏడుస్తారు! ఈ విచిత్ర సాంప్రదాయం గురించి తెలుసా?

పెళ్లి అంటే సాధారణంగా ఆనందం, వేడుకలు, పాటలు, నృత్యాలతో సందడిగా ఉండే కార్యక్రమం. కానీ చైనాలోని తుజియా తెగలో పెళ్లికి ముందు వధువు ఏడవడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. పెళ్లికి సుమారు నెల రోజుల ముందు నుంచే ఈ ఆచారం ప్రారంభమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో వధువు ప్రతిరోజూ సుమారు గంటపాటు ఏడుస్తూ సంప్రదాయ పాటలు పాడుతుందని చారిత్రక వివరాలు చెబుతున్నాయి. ఏడుపు వెనుక అసలు అర్థం ఏంటి? ఇది కేవలం దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి చేసే…

Read Full News

ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్‌ చేసిన పోలీసుల కళ్లు జిగేల్‌!

బీహార్‌లో మద్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ రైల్లోని ఏసీ కోచ్‌లో మహిళా ప్రయాణికురాలి వద్ద పెద్దమొత్తంలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మహిళను అరెస్ట్‌ చేసి 75 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో విశేషమేంటంటే.. బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. ఈ క్రమంలో ఈ అక్రమ మద్యం రవాణా వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుంచి జయనగర్ వెళ్తున్న ‘స్వాతంత్ర్య సేనాని ఎక్స్‌ప్రెస్’…

Read Full News

దుమ్ముదుమారం.. 22Aపై కీలక చర్చ..! తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. 22Aపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చ జరగనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. జనగణన–2027పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీసీ/ఓబీసీ కాలమ్‌ను జనగణన ప్రశ్నావళిలో చేర్చే అంశంపై కూడా చర్చింనున్నారు. అయితే.. మండలిలో బీఆర్ఎస్‌ సభ్యుల ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులతో బీఆర్ఎస్‌ సభ్యుల నిరసన తెలిపారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని..బీఆర్ఎస్ సభ్యులు సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ప్రశ్నోత్తరాల తర్వాత…

Read Full News

Andhra: కొండపై ఏదో తచ్చాడుతూ కనిపించింది.. ఏంటా అని కెమెరాలో జూమ్ చేసి చూడగా..

అంతరించిపోతున్న జీవజాతులలో ఒకటైన అరుదైన పునుగుపిల్లి మంగళగిరి ప్రాంతంలో సంచరిస్తూ కనిపించడం స్థానికులు, పర్యావరణవేత్తలలో ఆసక్తిని రేకెత్తించింది. సాధారణంగా తిరుమల కొండ పరిసరాల్లో అరుదుగా దర్శనమిచ్చే ఈ వన్యజీవి.. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండపై ఉన్న ఓ గుహలో ప్రత్యక్షమైంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొంతమంది దీనిని గుర్తించి కెమెరాల్లో బంధించారు. అనంతరం వీడియోను అటవీ శాఖ అధికారులకు పంపించి సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారుల ప్రకారం.. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొంతకాలంగా…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 నాలుగో కంటెస్టెంట్‌గా రాయలసీమ కుర్రాడు.. సుధీర్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఇదే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా ఆరంభమయింది. ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం నుంచి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతోంది. హోస్ట్ కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నాడు. అలాగే వాళ్ల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తదితర విషయాల గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటి దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది. ఇక రెండవ కంటెస్టెంట్…

Read Full News

ఫ్లైట్‌లో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లొచ్చు..? ఈ తప్పులు చేస్తే చిక్కులు తప్పవు..

గోవా టూర్ ముగించుకుని తిరిగొస్తూ అక్కడి ఫేమస్ ఫెనీ, వైన్ లేదా నచ్చిన బ్రాండ్ విస్కీని తెచ్చుకోవాలనుకుంటున్నారా? లేదా విదేశాల నుంచి వస్తూ కనెక్టింగ్ డొమెస్టిక్ ఫ్లైట్‌లో మీ ఊరికి మద్యం తీసుకెళ్తున్నారా? అయితే విమానాల్లో మద్యం రవాణాకు సంబంధించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన కఠిన నిబంధనలపై అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం. నిబంధనలు తెలియక చాలామంది ఎయిర్‌పోర్టులలో సెక్యూరిటీ చెకింగ్ వద్ద చేదు అనుభవాలను…

Read Full News

వీపు గోకుతూ నెలకు రూ.14 లక్షల సంపాదన! చిన్ననాటి జ్ఞాపకమే పెద్ద వ్యాపారం..

చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన 32 ఏళ్ల ఝాంగ్ షియావోకియావో తన వినూత్న వ్యాపార ఐడియాతో ఆశ్చర్యపరుస్తున్నాడు. శరీర దురదను గోకే వినూత్న సేవలను (ఇచ్-స్క్రాచింగ్) ఒక ప్రాఫిటబుల్ బిజినెస్‌గా మలచి, ప్రస్తుతం రెండు అవుట్‌లెట్ల ద్వారా నెలకు రూ. 14 లక్షల (1,00,000 యువాన్లు) వరకు ఆర్జిస్తున్నాడు. ఆధునిక జీవనశైలిలో ఒంటరితనం, చేతులు అందక ఇబ్బంది పడే వీపు భాగాలపై దురద తీర్చుకోవడానికి ఈ సేవలు ఒక మంచి ఉపశమనంగా మారుతుండటంతో దీనికి ఊహించని స్థాయిలో ఆదరణ…

Read Full News

Dhurandhar: ‘ధురంధర్’ సినిమాలో అసలు స్టోరీ ఎక్కడుంది? 3వేల కోట్ల బ్లాక్ బస్టర్ పై స్టార్ డైరెక్టర్ విమర్శలు

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ. 3,000 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించాయి. అయితే, ఈ సినిమా విజయం, దాని కథాంశంపై ప్రముఖ దర్శకుడు టిగ్మాన్షు ధూలియా సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘ధురందర్‌లో అసలు కథే లేదు’ అని అక్కసు వెళ్లగక్కారు. ‘కరెంట్ స్టేట్ ఆఫ్ మీడియా అండ్ ఫిల్మ్’ కార్యక్రమానికి హాజరైన టిగ్మాన్షు…

Read Full News

ఇక నాలుగేళ్లే.. 2030 నాటికి ఏఐతో మనుషులు అంతం.. జాకబ్ కాక్సన్ సంచలన ప్రకటన !

గత మూడేళ్లుగా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి అగ్రగామి టెక్ సంస్థల్లో పనిచేసిన జాకబ్ కాక్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న వినాశనకరమైన రేసును చూసి ఆయన ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రపంచాన్ని శాసించే స్వీయ ప్రతిభ గల సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల కోసం టెక్ దిగ్గజాలు మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది కాలంలోనే ఏఐ వ్యవస్థలు దేనినైనా హ్యాక్…

Read Full News

OTT Movie: థియేటర్లలో బ్యాన్.. కట్ చేస్తే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు.. ఆపై ఓటీటీలోనూ సంచలనం

ఇటీవల కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు లేదా సంభాషణల విషయంలో కొన్ని సంస్థలు ఈ చిత్రాలను వ్యతిరేకించడంతో అవి థియేటర్లలో విడుదల కావడం లేదు. అలాగే బోల్డ్ కంటెంట్ కారణంగా కూడా కొన్ని సినిమాలు విడుదల కాలేదు. అయితే, ఈ చిత్రాలు ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాలను ఓటీటీలో చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలా థియేటర్లలో నిషేధానికి గురై ఓటీటీలో సంచలనం సృష్టంచిన…

Read Full News