
Rain Alert: వణుకు పుట్టిస్తోన్న వరుస అల్పపీడనాలు.. ఇక తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర
ఏపీని వరుస అల్పపీడనాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో నేడు(సెప్టెంబర్ 22న) ఓ అల్పపీడనం ఏర్పడనుండగా.. 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని సూచించారు. ఆదివారం సింగరాయకొండలో 69.5మిమీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,…