
Telangana: బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల
తెలంగాణలో పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు భారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బుసాని వెంకటేశ్వరరావు…