Headlines

Andhra: కొండపై ఏదో తచ్చాడుతూ కనిపించింది.. ఏంటా అని కెమెరాలో జూమ్ చేసి చూడగా..

అంతరించిపోతున్న జీవజాతులలో ఒకటైన అరుదైన పునుగుపిల్లి మంగళగిరి ప్రాంతంలో సంచరిస్తూ కనిపించడం స్థానికులు, పర్యావరణవేత్తలలో ఆసక్తిని రేకెత్తించింది. సాధారణంగా తిరుమల కొండ పరిసరాల్లో అరుదుగా దర్శనమిచ్చే ఈ వన్యజీవి.. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండపై ఉన్న ఓ గుహలో ప్రత్యక్షమైంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొంతమంది దీనిని గుర్తించి కెమెరాల్లో బంధించారు. అనంతరం వీడియోను అటవీ శాఖ అధికారులకు పంపించి సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారుల ప్రకారం.. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొంతకాలంగా…

Read Full News

Team India: 16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఛోటా ప్యాకెట్.. అదేంటంటే?

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాట్‌తో చరిత్ర సృష్టించాడు. సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 350 పరుగులు చేసిన అతడు, టోర్నీలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో భారత క్రికెట్‌లో 16 ఏళ్లుగా కొనసాగుతున్న రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ డబుల్.. సౌత్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ ఏకంగా 270 పరుగులు చేశాడు. ఆ…

Read Full News

Hyderabad: ఏందిరా సామి.. బేకరీనా..? కెమికల్ దుకాణమా? అధికారుల సోదాల్లో షాకింగ్ సీన్!

హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో ఆహార కల్తీ, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ (SOT) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు M-FAST, SOT ఉప్పల్ బృందాలు భరత్‌నగర్ కాలనీలోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీపై తనిఖీలు చేపట్టాయి. దాడుల్లో బేకరీలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు, బేకరీ ఉత్పత్తుల తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అంతేకాకుండా బేకరీ పరిసరాలను అపరిశుభ్రమైన పరిస్థితుల్లో…

Read Full News

Hyderabad: 48 గంటల్లో హత్య కేసును చేధించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.. ఎలా అంటే?

రంగా రెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస నేరాల గుట్టును పోలీసులు మట్టుబెట్టారు. అలీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసుతో పాటు, కాటేదాన్‌లోని హర్ష్ బేకర్స్ లో జరిగిన భారీ నగదు చోరీ కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రెండు వేర్వేరు కేసుల్లో కీలక పురోగతి సాధించిన పోలీసులు, ప్రధాన నిందితులతో పాటు వారి సహచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసులకు…

Read Full News

Guntur: ఎత్తిపోతలకు కొత్త ఊపు.. జలపాతం అందాల మధ్య జిప్‌లైన్, జిప్ సైకిల్ థ్రిల్!

పల్నాడు: ప్రకృతి అందాలు.. జలపాతం హోరు.. చుట్టూ పచ్చని కొండలు.. ఇక వీటన్నింటినీ ఆకాశం నుంచి చూస్తూ సాహసాన్ని ఆస్వాదించే అవకాశం కూడా వచ్చేసింది. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం ఇకపై అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా సుమారు రూ.1.70 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి. మాచర్ల మండలంలోని ఎత్తిపోతల పర్యాటక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ…

Read Full News

Ishan Kishan: ఈషాన్ కిషన్ సెన్సేషనల్ కామెంట్స్.. బీసీసీఐ కాంట్రాక్ట్ పోయినప్పుడు అసలు ఏం జరిగిందంటే?

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో 270 పరుగులతో తన విశ్వరూపం చూపించిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్, మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ సెలెక్టర్లకు తన మాటలతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. తన కష్టకాలం నేర్పిన పాఠాలు, జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ పై కిషన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. భారత జట్టులో క్రమం తప్పకుండా ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన నాటి చేదు అనుభవాలను…

Read Full News

SBIలో 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (Specialist Cadre Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ కింద మొత్తం 222 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా సెప్టెంబరు 4, 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు…

Read Full News

Toxic Movie: టాక్సిక్ సినిమాపై ఆశలు.. భారీ ప్రాజెక్ట్ వదులుకున్న యశ్.. డైరెక్టర్ కామెంట్స్..

కేజీఎఫ్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు యశ్. ఈ రెండు సినిమాల తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని టాక్సిక్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇందులో భారీ తారాగణం నటించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా కోసం యశ్ మరో భారీ ప్రాజెక్టు వదులుకున్నారట. ఈ విషయాన్ని డైరెక్టర్ పీఎస్ మిత్రన్ వెల్లడించారు. ఆయన…

Read Full News

NEET PG అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తొలిసారి ఆన్సర్ కీ! మీ జవాబులు చెక్ చేసుకోండి!

దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్య అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET PG 2026 ఆన్సర్ కీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈసారి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తొలిసారిగా అధికారిక ఆన్సర్ కీని అందుబాటులోకి తీసుకురానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సెప్టెంబర్ 7 నాటికి NBEMS అధికారికంగా ఆన్సర్ కీ విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా విద్యా రంగ నివేదికల…

Read Full News

ఆ సినిమాలో పాత్ర ఇవ్వలేదని కంటతడి పెట్టుకున్న మహానటి..

అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రాలలో మహానటి సావిత్రికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఆమె లేకుండా ఆ సంస్థ చిత్రాలు పూర్తయ్యేవి కావు. అయితే, 1961లో నిర్మించిన ఇద్దరు మిత్రులు చిత్ర విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ పాత్రలు ఉన్నప్పటికీ, వాటికి తగినంత ప్రాధాన్యం లేదని నిర్మాత దుక్కిపాటి ముందే స్పష్టం చేశారు. ఈ కారణంగా సావిత్రికి ఈ సినిమాలో వేషం ఇవ్వలేమని ఆయన తెలిపారు. ఈ వార్త…

Read Full News