Jai Shri Ram: దండకారణ్యంలో శ్రీరాముడి చారిత్రక ఆనవాళ్లు.. వనవాసం కాలం నాటి రహస్య ఆలయాలు
శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసంలో అత్యధిక కాలాన్ని దండకారణ్యంలోనే గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర భూమిలో శ్రీరాముడి అడుగుజాడలకు సంబంధించిన అనేక రహస్య క్షేత్రాలు దశాబ్దాలుగా వెలుగు చూడకుండా ఉన్నాయి. టీవీ9 దృశ్యం కార్యక్రమం ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అదృశ్యమైన రామాయణ కాలం నాటి ప్రదేశాలు ఇప్పుడు బయటి ప్రపంచానికి పరిచయమయ్యాయి. ఈ ప్రాంతంలో శ్రీరాముడు మహాదేవుడిని పూజించిన శివాలయం అవశేషాలు, శ్రీరాముడు, సీతాదేవి పండ్లు తిన్న…