ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్ డెలివరీ .. అరుదైన ఘటన
చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి దిలి ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. వైద్య చరిత్రలోనే ఇది అత్యంత విశేషమైన ఘట్టంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. వుహాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో సుమారు 20 మంది వైద్య నిపుణులు, నర్సుల బృందం సమిష్టి కృషితో ఈ క్లిష్టమైన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రసవంలో నలుగురు ఆడ శిశువులు, ఒక మగ శిశువు జన్మించారు. వైద్యుల వివరాల ప్రకారం, సహజ సిద్ధంగా ఒకేసారి…