Naga Babu: 3 ఏళ్ల చిన్నారికి గుండె సమస్య.. గొప్ప మనసు చాటుకున్న నాగబాబు.. వీడియో ఇదిగో
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గుండె సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్న 3 ఏళ్ల చిన్నారి కట్టా శ్రీహర్ష వైద్యఖర్చుల కోసం రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారాయన. సోమవారం (ఫిబ్రవరి 24) హైదరాబాద్ లో చిన్నారి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల క్యాష్ అందజేశారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తాటిపూడి గ్రామంకు చెందిన…