Headlines

చాట్ జీపీటీ-6 అస్త్ర విడుదల..ఇది మనం ఊహించుకున్నంత స్మార్టేనా..?

‘అస్త్ర’ విడుదలతో కొత్త తరం వ్యాపారాలు, శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత ఊతం లభిస్తుందని ఆల్ట్‌మన్‌ అన్నారు. ప్రస్తుతం మనం ఏజీఐ యుగంలోకి ప్రవేశించామని భావించడం అసంబద్ధం కాదని ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏఐ చరిత్రను తిరిగి చూసినప్పుడు ‘అస్త్ర’ విడుదల కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉందన్నారు. కోడింగ్‌లో ‘అస్త్ర’ పనితీరు ఎంతో అద్భుతంగా ఉంది. ఓపెన్‌ఏఐ నిర్వహించిన పరీక్షల ప్రకారం.. ఇది జీపీటీ-5.6 సోల్ (Sol)తో పాటు ఆంథ్రోపిక్…

Read Full News

Cinema: 2 కోట్లతో తీస్తే 80 కోట్ల కలెక్షన్లు.. థియేటర్ బయటే చెప్పులు విడిచి మరీ ఈ సినిమా చూస్తున్నారు

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రిలీజ్ సమయంలో కొన్ని షోలకే ఇబ్బంది పడిన ఈ చిత్రం, ఇప్పుడు భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్రదర్శితమవుతోంది. త్వరలోనే ఓవర్సీస్ లోనూ ఈ బ్లాక్ బస్టర్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు పన్ను మినహాయింపు కూడా లభించింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?…

Read Full News

TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్

‘You have always been a great source of inspiration to me’ అంటూ తనకు పవన్ ఎప్పుడూ స్ఫూర్తి అని చెప్పాడు. ఆరోగ్యం, ఆనందం, మరెన్నో అద్భుతమైన సంవత్సరాలను పవన్‌ చూడాలని ఆకాంక్షించాడు చరణ్. కానీ చివర్లో ఒక్క మాటతో చరణ్ మెగా ఫ్యాన్స్‌ను టచ్ చేశాడు.‘Love you, Babai’ అంటూ తన ట్వీట్‌లో కోట్ చేశాడు. దాంతో పాటే లవ్‌ ఎమోజీని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్…

Read Full News

చిన్న పల్లెటూరి నుంచి అగ్నిపరీక్ష వరకు.. వాళ్లకు నాకు ఐఫోన్, నోకియా ఫోన్‌కు ఉన్నంత తేడా ఉంది

అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ రాజకుమారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో తన ఆటతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజకుమారి తన జీవిత ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. రాజకుమారి తన వ్యక్తిగత బాధలను, భయాలను పక్కన పెట్టి, తన పిల్లల కోసం, తన కోసం తాను…

Read Full News

Telangana: ఛీ.. ఛీ ఇలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు.. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సైదాబీ అనే మహిళకు షేక్ సుభాని అనే కుమారుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కొడుకుని కష్టపడి పెంచిన సైదాబీ, కొన్నేళ్ల క్రితమే అతనికి పెళ్లి కూడా చేసింది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే సుభాని తాగుడుకి బానిస అవ్వడంతో ఏడాది క్రితమే అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో…

Read Full News

Andhra: ధర దండిగా పెరిగినా దిగులతో నిమ్మ రైతు.. ఎందుకంటే..?

నిమ్మకాయల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌లో క్వింటా నిమ్మకాయల ధర రికార్డు స్థాయిలో రూ.10,000 మార్కును అధిగమించింది. ఆగస్టు మొదటి వారంలో రూ.6,000 ఉన్న నిమ్మ ధర ఇప్పుడు రూ.10,000 నుంచి రూ.11,000 మధ్య పలుకుతోంది. అయితే, ఈ ధరల పెరుగుదల రైతుల ముఖాల్లో సంతోషాన్ని తీసుకురాలేకపోయింది. ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది నిమ్మ తోటల్లో దిగుబడి బాగా తగ్గింది. రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు,…

Read Full News

పెళ్లికి ముందు నెల రోజుల పాటు ఏడుస్తారు! ఈ విచిత్ర సాంప్రదాయం గురించి తెలుసా?

పెళ్లి అంటే సాధారణంగా ఆనందం, వేడుకలు, పాటలు, నృత్యాలతో సందడిగా ఉండే కార్యక్రమం. కానీ చైనాలోని తుజియా తెగలో పెళ్లికి ముందు వధువు ఏడవడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. పెళ్లికి సుమారు నెల రోజుల ముందు నుంచే ఈ ఆచారం ప్రారంభమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో వధువు ప్రతిరోజూ సుమారు గంటపాటు ఏడుస్తూ సంప్రదాయ పాటలు పాడుతుందని చారిత్రక వివరాలు చెబుతున్నాయి. ఏడుపు వెనుక అసలు అర్థం ఏంటి? ఇది కేవలం దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి చేసే…

Read Full News

ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక!

నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో అతలాకుతలమవుతున్న బీహార్‌కు మరో కొత్త భయం పట్టుకుంది. వరద ఉధృతికి జలాశయాల నుంచి కొట్టుకొస్తున్న అసాధారణంగా ఉన్న, గుర్తుతెలియని చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ వనరుల శాఖ కీలక ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. వరదల్లో మురుగునీరు, రసాయనాలు, చనిపోయిన జంతువుల వ్యర్థాలు కలవడంతో ఆ నీటిలో ప్రయాణించే చేపలు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం…

Read Full News

నిమ్స్‌‌లో పేద యువకుడికి పునర్జన్మ.. 3D మ్యాపింగ్‌తో అరుదైన ఉచిత గుండె శస్త్రచికిత్స!

పేదరికం ఒకవైపు, ప్రాణాల మీదకు తెచ్చే అరుదైన గుండె సమస్య మరొక వైపు.. తెలంగాణకు చెందిన ఓ 30 ఏళ్ల దినసరి కూలీ జీవితంలో తలెత్తిన పెద్ద సంక్షోభమిది. రెండేళ్ల క్రితం కష్టం చేసి పనిచేస్తున్న సమయంలో అతనికి అకస్మాత్తుగా ఆయాసం, ఛాతీలో తీవ్రమైన నొప్పి ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ ఆసుపత్రులను సంప్రదిస్తే ఈసీజీ, గుండె ఎంఆర్‌ఐ పరీక్షలు చేసి వెంటిక్యులర్ ప్రీమెచ్యూర్ కాంప్లెక్సెస్ అనే అరుదైన గుండె లయ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్కడ రేడియోఫ్రీక్వెన్సీ…

Read Full News

Andhra News: చూసి అమాయకురాలనుకునేరు.. ఆమె మామూలు లేడి కాదు భయ్యో..

మదనపల్లె పట్టణంలో లేడీ డాన్‌గా పేరొందిన కోనేటి సులోచన నివాసంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను పోలీసులు గుర్తించారు. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలతోనే ఈమె అక్రమాలకు పాల్పడి డాన్‌గా ఎదిగినట్లు తేలింది. గతంలోనే ఈమెపై రౌడీషీట్ తెరిచిన పోలీసులు, పలువురిని మోసగించినట్లు గుర్తించారు. తాజాగా ఒక కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు సులోచనతో పాటు ఆమె సోదరుడి నివాసంలో సోదాలు నిర్వహించి, దాదాపు 50కి…

Read Full News