
సర్జరీ సమయంలో కూలిన ఆస్పత్రి పైకప్పు.. డాక్టర్‌కు స్వల్పగాయాలు, నర్సు పరిస్థితి ఏమైందంటే..
పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) లో పనిచేస్తున్న ఒక వైద్యుడు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ క్లిప్‌లో ఆసుపత్రి లోపల కిటికీ పైన ఉన్న పైకప్పు నుండి ప్లాస్టర్ పడిపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆపరేషన్ సమయంలో ఆపరేటింగ్ థియేటర్ పైకప్పు కూలిపోయినట్టుగా సదరు డాక్టర్ పేర్కొన్నాడు. ఈ సంఘటనలో అతను కూడా గాయపడినట్టుగా చెప్పారు. పరిస్థితిని వివరిస్తూ సంఘటనకు బాధ్యులకు విజ్ఞప్తి చేస్తూ అతను వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్…