
దొంగ సొత్తును మాయం చేసిన పోలీసోళ్ళు.. ! పోలీస్ స్టేషన్ స్టోర్‌హౌస్ నుండి 73 టేకు దుంగలు అదృశ్యం
రాజస్థాన్‌లోని అనూహ్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ధరియావాడ్ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సర్ఫ్రాజ్ నవాజ్ 2020 టేకు కలప దొంగతనం కేసులో ఒక నిందితుడిని నిర్దోషిగా విడుదల చేశారు. సాక్ష్యాధారాలు లేకపోవడం, పోలీసుల తీవ్రమైన విధానపరమైన లోపాలను పేర్కొంటూ తీర్పునిచ్చారు. ఈ కేసులో టేకు కలప దుర్వినియోగంలో పాల్గొన్న అనేక మంది పోలీసు అధికారులపై దర్యాప్తు చేసి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. నిందితుడు ప్రకాష్ తరపు న్యాయవాది సయ్యద్…