
Andhra: అయ్యో చిట్టితల్లి.! అప్పుడే నూరేళ్లు నిండాయా.. ఎంత ఘోరం జరిగిపోయింది
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాచిపెంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న కీర్తన(17) అనే బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. కీర్తన గత నెల రోజులుగా రక్తహీనత, జ్వరం, పచ్చకామర్ల సమస్యలతో బాధపడుతుంది. అయితే ఆమె ఆరోగ్యం పరిస్థితిని కేజీబీవీ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో కీర్తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు గత నెల 23న స్కూల్ నుంచి తమ స్వగ్రామం…