
కొనసాగుతున్న ద్రోణికి తోడు మరో అల్పపీడనం..భారీ వర్ష సూచన వీడియో
ఓవైపు మధ్యబంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండగా మరోవైపు సెప్టెంబరు 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…