
ఈ దేశాలలో సుప్రీంకోర్టు ఉండదు.. న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసా..?
ప్రపంచంలోని అన్ని దేశాలలో న్యాయ వ్యవస్థ ఒకేలా ఉండదు. భారత్, అమెరికా వంటి దేశాలలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఉంటుంది. అయితే చాలా దేశాలలో సుప్రీంకోర్టు అనే పేరు ఉండదు. కానీ అత్యున్నత న్యాయ అధికారం వేరే పేర్లతో ఉంటుంది లేదా ఒకటి కంటే ఎక్కువ సంస్థలు ఉంటాయి. అటువంటి కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీ: రెండు వేర్వేరు కోర్టులు జర్మనీలో న్యాయ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్…