ఫుకెట్-ఢిల్లీ విమాన పైలట్‌పై వేటు.. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే ఘటన చోటుచేసుకుంది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI2379 విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కమాండర్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. సైకోయాక్టివ్ (మానసిక ప్రభావం చూపే) పదార్థానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో పైలట్ ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. భద్రత, విధులకు అనుకూలత, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన విషయంలో తమది జీరో టాలరెన్స్ విధానమని ఎయిర్…