Headlines

Vastu Tips: అప్పులు ఎన్ని ఉన్నా భయపడకండి.. జీలకర్రతో ఈ పరిహారం చేయండి!

డబ్బు చేతిలో నిలవకపోవడం, ఊహించని ఖర్చులు పెరగడం, అప్పులు పేరుకుపోవడం వంటి పరిస్థితులు చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక ప్రణాళికతో పాటు, తమ విశ్వాసాలకు అనుగుణంగా కొన్ని వాస్తు పరిహారాలను కూడా పాటిస్తుంటారు. జీలకర్రతో చేసే ఈ పరిహారాలు చాలా సులభంగా చేయగలిగేవిగా చెప్పబడుతున్నాయి. మరి నగదు ప్రవాహం, అప్పుల నుంచి ఉపశమనం, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కోసం జీలకర్రను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా…

Read Full News

గణేష్ చతుర్థి.. తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ గణపతి పండళ్లు.. కోర్కెలు తీర్చే దేవుడు!

గణేశుడు ఆటంకాలను తొలగించేవాడని, ఆయనను పూజిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భారతదేశంలోని ప్రసిద్ధ గణపతి పండల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆధ్యాత్మికత, సంస్కృతి, కళా నైపుణ్యం కొలువైన ఈ 5 ప్రసిద్ధ పండళ్లను ప్రతీ ఒక్కరూ తప్పక దర్శించాలి. లాల్‌బాగ్ చా రాజా (ముంబై): ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గణపతి పండల్ ఇది. 1934లో స్థాపించబడిన…

Read Full News

Sim Cards: మీ ఆధార్‌ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయి..? సింఫుల్‌గా ఇలా తెలుసుకోండి.. సెకన్లలోనే అన్నీ..

సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. సిమ్ కార్డు మోసాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఒకరి పేరుతో మరొకరు సిమ్ కార్డు తీసుకోవడం, సిమ్ కార్డులను ట్యాపరింగ్ చేయడం వంటి మోసాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు కేంద్రం ఇటీవల కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇకపై ఒక వ్యక్తి తన పేరుపై గరిష్టంగా తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోకుండా టెలికాం శాఖ పరిమితులు విధించింది. మీ పేరుపై ఇప్పటికే తొమ్మది…

Read Full News

LPG Cylinders: 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు రూ.3 వేలు.. అకౌంట్లో జమ చేయనున్న ఆ ప్రభుత్వం..!

LPG Cylinders: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు మూడు ఎల్‌పిజి సిలిండర్ల ఖర్చును భరించేందుకు ఏటా రూ.3,000 అందజేస్తామని ఆయన తెలిపారు. గోవా ప్రభుత్వం “గోవా ఉజ్వల యోజన 2026″కు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు మూడు గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్లు లేదా పిఎన్‌జిల ఖర్చుకు సమానమైన రూ.3,000 వార్షిక ఆర్థిక సహాయం అందుతుంది. 2022 గోవా అసెంబ్లీ…

Read Full News

Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే అదనంగా 2 శాతం అడుగుతున్నారా..? నో వర్రీ.. ఈ రూల్స్‌తో మీకే లాభం..

ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం అనేది పెరిగిపోతుంది. ఎవరి చేతుల్లో చూసినా కార్డులు కనిపిస్తున్నాయి. షాపింగ్ ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం ఎక్కువమంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించి దుకాణాల్లో ఖరీదైనవి ఏమైనా కొనుగోలు చేసినప్పుడు అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్స్‌కు మొత్తం బిల్లుపై అదనంగా 2 శాతం చెల్లించాలని అడుగుతుంటారు. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసినందుకు ఛార్జీలు పడతాయని, అందుకే చెల్లించాలని షాపు నిర్వాహకులు…

Read Full News

Viral Video: రాత్రి ఇంటికెళ్తుండగా ఎదురైన చిరుత పులి.. కార్మికులు తెలివిగా ఏం చేశారంటే?

నల్గొండ జిల్లాలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. పీఏ పల్లి మండలం చిలకమర్రి స్టేజి వద్ద చిరుత కదలికలను గుర్తించారు AKBR వద్ద పనిచేస్తున్న కార్మికులు.  వారు పనులు ముగించుకొని వాహనంలో ఇంటికి బయల్దేరగా.. మార్గమధ్యలో చిలకమర్రి స్టేజ్‌ వద్ద వారికి ఓ చిరుతపులి ఎదురైంది. దాన్ని చూసి మొదట కంగారుపడిన కార్మికులు.. వాహనాన్ని పక్కకు ఆపి తమ మొబైల్‌లో చిరుత దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం వాహనం హారన్ కొట్టడంతో ఆ చిరుత అక్కడి నుంచి…

Read Full News

TOP9 ET: డ్రాగన్‌ కోసం రంగలోకి దిగిన లూగర్..| రాకా కోసం.. ఈ సారి రెమ్యునరేషన్ కాదు.. అంతకు మించి..

డ్రాగన్‌ కోసం లూగర్ రంగలోకి దిగాడు. ఎస్! ఇటీవల ఎన్టీఆర్‌కు డ్రాగన్ సినిమా షూటింగ్‌లో గాయమైన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేశారు వైద్యులు. అలాగే.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో డ్రాగన్ షూటింగ్ డిలే అవుతూ వస్తోందనే టాక్ వినిపిస్తునే ఉంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. కానీ లేటెస్ట్‌గా తారక్ ఈ సినిమా సెట్స్‌లోకి అడుపెట్టినట్టుగా తెలుస్తోంది. షోల్డర్ సర్జరీ…

Read Full News

చేదులోనే ఉంది మహా ఆరోగ్యం.. వేప వల్ల కలిగే ఈ అద్భుత ప్రయోజనాలు మీకు తెలుసా?

మన ఇంటి ఆవరణలో లేదా చుట్టుపక్కల సులభంగా కనిపించే వేప చెట్టు ఒక శక్తివంతమైన ప్రకృతి ప్రసాదించిన ఔషధం. ఆయుర్వేదంలో వేపకు విశిష్ట స్థానం ఉంది. వేప వేరు నుండి ఆకుల వరకు ప్రతి భాగం ఏదో ఒక రకమైన ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. వేపలోని క్రిమిసంహారక, యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ గుణాలు పలు రకాల వ్యాధుల నుండి మనల్ని కాపాడుతాయి. వేప వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది:…

Read Full News

ఏకాంతంగా ఉన్నప్పుడే వెళ్తారు.. ఆ తర్వాతే కథ మొదలైద్ది.. వరంగల్‌లో సంచలన ఘటన..

ఈ నెల 4వ తేదీన వరంగల్ శివారు బెస్తం చెరువు సమీపంలో జరిగిన గౌతం అనే యువకుడి మర్డర్ మిస్టరీ వీడింది. అత్యంత దారుణంగా కత్తులతో పొడిచిచంపిన ఉన్మాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ ముఠాకు ప్రేమజంటలే టార్గెట్ అని పోలీసులు తేల్చారు.. ఏకాంతంగా కనిపించే జంటలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంటారని తెలిపారు. ఓ వ్యక్తిని బెదిరిస్తున్న క్రమంలో ఆ ముఠాకు అడ్డుచెప్పిన పాపానికి గౌతమ్ అనే అమాయకున్ని హత్య చేశారని…

Read Full News

7 ఫోర్లు, 13 సిక్సర్లతో కాటేరమ్మ కొడుకు విధ్వంసం.. ప్రపంచ రికార్డ్‌నే అస్సాం పార్శిల్ చేశాడుగా..!

Abhishek Sharma Birthday: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ నేడు తన 27వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ టీమిండియా డేంజరస్ ప్లేయర్ క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. 2000 సెప్టెంబర్ 4న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్ ఎడమచేతి బ్యాటింగ్‌తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అభిషేక్.. నిలకడైన ప్రదర్శనలతో భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కొద్దికాలానికే టీ20ల్లో…

Read Full News