OTT Movie: 50 లక్షలతో తీస్తే 120 కోట్ల వసూళ్లు.. ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. అధికారిక ప్రకటన

OTT Movie: 50 లక్షలతో తీస్తే 120 కోట్ల వసూళ్లు.. ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. అధికారిక ప్రకటన


గతేడాది చాలా సినిమాలు రిలీజయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మరికొన్ని హిట్స్, యావరేజ్ గానూ నిలిచాయి. చాలా సినిమాలు అంచనాలు అందుకోలేక చతికిలపడ్డాయి. అదే సమయంలో కొన్ని చిన్న సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ఆడియెన్స్ మెప్పు పొందాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కేవలం రూ. 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తూ ఏకంగా రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అలాగనీ ఈ సినిమాలో స్టార్ నటీనటులు లేరు. స్పెషల్ సాంగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లు లేవు. వీఎఫ్ ఎక్స్ హంగులు లేవు. ఇలా కమర్షియల్ హంగులు లేనప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాను తెగ చూసేశారు. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? గతేడాది గుజరాతిలో విడుదలైన ‘లాలో- కృష్ణ సదా సహాయతే’ గురించే ఇంత ఉపోద్ఘాతమంతా. అంకిత్ సఖియా తెరకెక్కించిన ఈ మూవీలో రీవా రచ్‌, శ్రుహద్‌ గోస్వామి, కరణ్‌ జోషి, మిష్టి కడేచా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లాలో- కృష్ణ సదా సహాయతే’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. సోనీ లివ్ ఓటీటీలో మార్చి 06 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే కేవలం హిందీ, గుజరాతీ భాషల్లోనే మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. తెలుగు స్ట్రీమింగ్ పై ఇంకా ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా కథేంటంటే..
లాలో ఒక ఆటో డ్రైవర్. గతంలో జరిగిన సంఘటనల వల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. బాగా తాగుడుకు బానిసవుతాడు. ఓసారి అనుకోకుండా ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకుపోతాడు. ఆ ఏకాంతంలో అతడికి కృష్ణుడి లీలలు ఆవిష్కృతమవుతాయి. గతం తాలూకు బాధలు, తన మనసులోని అలజడిని దాటుకుని కొత్త ఆశలతో ముందుకెళ్లడం మొదలపెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

సోని లివ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *