OTT Movie : హీరోయిన్ చేతిలో రాజకీయ నాయకుడి సీక్రెట్.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. 

OTT Movie : హీరోయిన్ చేతిలో రాజకీయ నాయకుడి సీక్రెట్.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. 


ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ ప్లాట్ ఫామ్స్ లలో విభిన్న రకాల జానర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. నిజానికి ఈ మూవీ ఒక తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఓటీటీ సినీప్రియులకు ఈ సినిమా మరింత ఆసక్తి కలిగించింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఇదివరకు ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో ఈ సినిమా ఒకటి. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు అనగనగా ఆస్ట్రేలియాలో.. ఈ మూవీని పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కించారు. అలాగే టైటిల్ కు తగినట్లుగానే సినిమా మొత్తాన్ని ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

కొత్త నటీనటులు కావడం.. ఎలాంటి హడావిడి లేకుండా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలైందో జనాలకు తెలియలేదు. 2025 మార్చి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిలో అగ్రజ లక్ష్మీ, చంద్ర కొమ్మల్‌పేట్, జేడీఆర్ చెరుకూరు, ప్రభ అగ్రజ కీలకపాత్రలు పోషించారు. అలాగే తారకరామ దర్శకత్వం వహించారు. యూవీ నిరంజన్ సంగీతం అందించగా.. క్రైమ్, బోల్డ్, సస్పెన్స్ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన సీక్రెట్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

ప్రస్తుతం ఈ మూవీ తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. బోల్డ్, లవ్, క్రైమ్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఆహాలో అందుబాటులోకి వచ్చేసింది. కథ విషయానికి వస్తే.. ఓ రాజకీయ నాయకుడు తన కుమారుడిని రాజకీయాల్లో సెటిల్ చేయాలని భావిస్తుంటాడు. అదే సమయంలో అతడికి సంబంధించిన ఓ సీక్రెట్ తన దగ్గర ఉందంటూ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ వస్తుంది. దీంతో వారిని చంపేయాలని కిల్లర్ కు కాంట్రాక్ట్ అప్పగిస్తాడు. ఆ తర్వాత అదే సీక్రెట్ హీరోయిన్ కు దొరుకుతుంది. దీంతో ఆమె ఓ ప్లాన్ చేస్తుంది. ఆమెకు హీరో ఎలా సహయం చేశాడు..? చివరకు ఆ సీక్రెట్ ఏంటీ ? అనేది సినిమా..

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *