చిన్న సినిమాగా విడుదలై, సంచలన విజయాన్ని అందుకుంది ‘లిటిల్‌హార్ట్స్’. ప్రముఖ యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శివానీ నాగారం కథానాయిక. సాయి మార్తాండ్ ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ కు దర్శకత్వం వహించారు. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించాడు. టీచర్స్ డే కానుకగా సెప్టెంబర్ 05న ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటివరకు సుమారు రూ. 50 కోట్ల కు చేరువలో ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్, బండ్ల గణేశ్ తదితర స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు కూడా లిటిల్ హార్ట్స్ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. అదే సమయంలో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ క్రమంలో లిటిల్ హార్ట్స్ సినిమా అక్టోబర్ 02 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం జరుగుతోది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు కూడా వైరలవుతున్నాయి. వీటిపై ఈటీవీ విన్ ఓటీటీ స్పందించింది. ఫేక్ పోస్టులు, వార్తలపై స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అక్టోబరు 2న లిటిల్ హార్ట్స్ సినిమా విడుదల అవుతుందంటూ ట్రెండ్ అవుతున్న ఫేక్ పోస్టర్‌ను పంచుకుంటూ ‘ఇలా నకిలీ ప్రచార ఫొటోలను వ్యాప్తి చేస్తే, మీ ఫోను మీద ఒట్టే’ అంటూ తన దైన శైలిలో వార్నింగ్ ఇచ్చింది. ‘మీరు ఇది ఊహించవద్దు. ప్రస్తుతం థియేటర్‌లన్నీ హౌస్‌ఫుల్‌తో రన్ అవుతున్నాయి’ అంటూ పేర్కొంది. అంటే ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీలోకి రావడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనన్నమాట.
ఇవి కూడా చదవండి
మీ ఫొన్ మీద ఒట్టే..
“We are excited to announce #littlehearts OTT release date….”
Don’t expect this 😂😂
We are still running housefull in theatres🥳🥳Ela fake images spread chesthe mi phone mida otte😂 pic.twitter.com/lnSlwuB9Fo
— ETV Win (@etvwin) September 19, 2025
https://t.co/6IwviqPRMT pic.twitter.com/ecCdF2lBVM
— ETV Win (@etvwin) September 19, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి