OTT Movie: మీకు జాంబీ సినిమాలంటే ఇష్టమా? ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్

OTT Movie: మీకు జాంబీ సినిమాలంటే ఇష్టమా? ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్


ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. అందులో ఒకటి హాలీవుడ్ సిరీస్ కూడా ఉంది. ఈ మూవీ 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ కు ఎంపికైంది. పలు ప్రతిష్ఠాత్మక అవార్డులకు కూడా నామినేట్ అయ్యింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా మొత్తం జాంబీ యూనివర్స్ లో జరుగుతుంది. క్వాంటం రియల్మ్ నుంచి వచ్చిన వైరస్ అవెంజర్స్‌తో సహా ఎక్కువ మందిని జాంబీలుగా మార్చేస్తుంది. అదే క్రమంలో కొత్త హీరోలు ఈ జాంబీలను ఎదుర్కొనేందుకు నడుం బిగిస్తారు.మరి చివరకు ఎవరు పై చేయి సాధించారన్నది ఈ సిరీస్ కథ. మార్వెల్ స్టూడియోస్ యానిమేషన్ బ్యానర్‌పై బ్రయాన్ ఆండ్రూస్, జెబ్ వెల్స్ రూపొందించిన ఈ సిరీస్ పేరు మార్వెల్ జాంబీస్. ఇమాన్ వెల్లాని (కమలా ఖాన్/మిస్ మార్వెల్), హడ్సన్ థామ్స్ (పీటర్ పార్కర్/స్పైడర్-మాన్), ఆక్వాఫినా (కాటీ), సిమూ లియు (షాంగ్-చీ), ఫ్లోరెన్స్ పగ్ (యెలెనా బెలోవా), డేవిడ్ హార్బర్ (రెడ్ గార్డియన్), ఎలిజబెత్ ఓల్సెన్ (వాండా మాక్సిమాఫ్/స్కార్లెట్ విచ్), హైలీ స్టీన్‌ఫెల్డ్ (కేట్ బిషప్), డొమినిక్ థోర్న్ (రిరి విలియమ్స్/ఐరన్‌హార్ట్), టాడ్ విలియమ్స్ (బ్లేడ్ నైట్) తదితర క్యాస్టింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.

ప్రస్తుతం ఈ యానిమేటెడ్ మినీ వెబ్ సిరీస్ జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మార్వెల్ సినిమాల అభిమానులు పిల్లలతో ఏదైనా చూడాలనుకుంటే మార్వెల్ జాంబీస్‌ను ట్రై చేయొచ్చు. ఇది పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దవాళ్లకు కూడా నచ్చేలా తెరకెక్కించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *