OTT Movie: తాజ్ మహల్‌ శివుని ఆలయమా? ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: తాజ్ మహల్‌ శివుని ఆలయమా? ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్


OTT Movie: తాజ్ మహల్‌ శివుని ఆలయమా? ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

బాలీవుడ్‌ నటుడు పరేశ్‌ రావల్‌ నటించిన చిత్రం ‘ది తాజ్‌ స్టోరీ’. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎన్నో వివాదాలకు దారి తీసింది. ముఖ్యంగా తాజ్ మహల్ నుంచి శివుని విగ్రహం బయటకు వస్తున్న దృశ్యంతో రిలీజైన పోస్టర్ కాంట్రవర్సీగా నిలిచింది. అయినా ఎలాగోలా అడ్డంకులను దాటి థియేటర్లలో అడుగు పెట్టిన కాంట్రవర్సీ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు సినిమా సుమారు 4 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ ది తాజ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ లయన్స్ గేట్ ప్లే సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 13 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఒరిజినల్ తెలుగు వెర్షన్ తో పాట తెలుగు, తమిళ్‌ భాషల్లోనూ ఈ కాంట్రవర్సీ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.
దర్శకుడు తుషార్‌ అమ్రిష్‌ గోయెల్‌ తెరకెక్కించిన ది తాజ్ స్టోరీ సినిమాలో జాకీర్‌ హుస్సేన్, అమృత ఖాన్విల్కర్, స్నేహ వాఘ్, నమిత్‌ దాస్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. సురేశ్‌ ఝూ ఈ మూవీని నిర్మించారు.

ది తాజ్ స్టోరీ ఏంటంటే?

తాజ్ మహల్ నిజంగా షాజహానే నిర్మించాడా? లేదా దీని వెనుక ఏదైనా తెలియని మిస్టరీ ఉందా? అనేదే ప్రధానాంశంగా ది తాజ్ స్టోరీ మూవీని తెరకెక్కించారు. తాజ్ మహల్ ఓ పురాతన శివాలయం అని, దీన్ని షాజహాన్ ఆక్రమించి సమాధిగా మార్చాడని చరిత్రకారుడు పీఎన్ ఓక్ వివాదాస్పద సిద్ధాంతం. 4వ శతాబ్దంలో రాజా పరమార్థి దేవ్ దీనిని నిర్మించారని… 17వ శతాబ్ధంలో షాజహాన్ దీన్ని మార్చారంటూ కొందరు నమ్ముతారు. అయితే పురాతత్వ శాఖ దీన్ని నిరాకరించింది. ఈ క్రమంలోనే తాజ్ మహల్ ఒక హిందూ దేవాలయం అని నిరూపించేందుకు విష్ణు దాస్ అనే టూర్ గైడ్ చేసిన పోరాటమే ది తాజ్ స్టోరీ. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ కాంట్రవర్సీ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

మరో మూడు రోజుల్లో ది తాజ్ స్టోరీ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *