OTT Movie: డెల్యూజన్ డిజార్డర్‌తో బాధపడే హీరో.. ఓటీటీలో వంద కోట్ల సినిమా.. యాక్షన్ సీక్వెన్స్ అద్దిరిపోయాయ్

OTT Movie: డెల్యూజన్ డిజార్డర్‌తో బాధపడే హీరో.. ఓటీటీలో వంద కోట్ల సినిమా.. యాక్షన్ సీక్వెన్స్ అద్దిరిపోయాయ్


సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే ఈ మధ్యన కొన్ని సినిమాలు 4 వారాలకు ముందే ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే రిలీజైన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఉపాధ్యాయుల దినోత్సవం కానుకగా సెప్టెంబర్ 05న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉండడం, యాక్షన్ సీక్వెన్సులు కూడా అదిరిపోవడంతో సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి వంద కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ నిపుణుల అంచనా. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ యాక్షన్‌ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన మదరాసి. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది.

ఇవి కూడా చదవండి

ఇందులో డెల్యూజన్ డిజార్డర్ (బాధలో ఉన్న అందరూ తన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని బాధ పడటం)తో సతమతమయ్యే యువకుడి పాత్రలో హీరో శివ కార్తికేయన్ అదరగొట్టాడు. అలాగే  విలన్‌గా  విద్యుత్ జమాల్ మెప్పించాడు. బిజు మేనన్, విక్రాంత్, షబ్బీర్ కారెక్కల్, అడుకళం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హీరో శివ కార్తికేయన్‌తో వీడియో ద్వారా అనౌన్స్ చేశాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మదరాసి సినిమా స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

 మరో నాలుగు రాజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *