OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఆరేళ్ల క్రితం థియేటర్లలో సంచలనం.. ఇప్పటికీ ఓటీటీ ట్రెండింగ్‏లో నంబర్ వన్..

OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఆరేళ్ల క్రితం థియేటర్లలో సంచలనం.. ఇప్పటికీ ఓటీటీ ట్రెండింగ్‏లో నంబర్ వన్..


ఆరు సంవత్సరాల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద విద్వంసం సృష్టించింది. అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లతో చరిత్ర సృష్టించింది. దాని బడ్జెట్ కంటే ఏడు రెట్లు ఎక్కువగా సంపాదించింది. ఇక ఆరేళ్లుగా అటు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. కథ ఆకర్షణీయంగా ఉంటే, తక్కువ బడ్జెట్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగలవని ఈ సినిమా నిరూపించింది. 2018లో వచ్చిన ఈ కథ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. మనం మాట్లాడుకుంటున్న చిత్రం “స్త్రీ.” ఇందులో బాలీవుడ్ స్టార్స్ రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

హారర్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా 2018 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ప్రజలను భయపెట్టడమే కాకుండా వారిని చాలా నవ్వించింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్ అవుతుంది. చందేరి అనే గ్రామంలో ఓ స్త్రీ అనే ఆత్మ వీధుల్లో తిరుగుతుంది. కేవలం అబ్బాయిలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఆ తర్వాత గ్రామంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది సినిమా. ఆ ఆత్మ కారణంగా శ్రద్ధా, రాజ్ కుమార్ జీవితాల్లో ఎదురైన పరిస్థితులే సినిమా. ఈ మూవీ ఆద్యంతం జనాలను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. భారతదేశంలోని టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఈ మూవీ దూసుకుపోతుంది. రూ.25 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతకీ స్త్రీ సినిమాను మీరు చూశారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *