OTT Movie: అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్‌కు..

OTT Movie: అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్‌కు..


చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన సినిమా ఘాటి. వేదం లాంటి సూపర్ హిట్ తర్వాత అనుష్కా శెట్టి- క్రిష్ జాగర్ల మూడి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా ఇది. తమిళ నటుడు విక్రమ్ ప్రభు, రమ్య కృష్ణన్, జగపతి బాు, జిషు సేన్ గుప్తా, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై రిలీజ్ కు ముందే భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అయితే సెప్టెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ఘాటి సినిమా ఆడియెన్స్ ను తీవ్రంగా నిరాశ పర్చింది. అనుష్క నటనకు వంక పెట్టలేనప్పటికీ కథా, కథనాలు ఆడియెన్స్ ను డిజప్పాయింట్ చేశాయి. దీనికి తోడు పుష్ప సినిమాతో పోలీకలు ఉండడంతో ఈ మూవీపై జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఘాటీ సినిమా థియేటర్లలో నుంచి త్వరగానే వెళ్లిపోయింది. అయితే ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది.

‘ఘాటి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజైన 8 వారాలకు ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలనుకున్నారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్‌ 26 నుంచి ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఘాటీ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఘాటీ సినిమాను నిర్మించారు. నాగవెల్లి విద్యాసాగర్‌ స్వరాలు సమకూర్చారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునే వారికి ఘాటి సినిమా ఒక మంచి ఛాయిస్.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

ఘాటి సినిమాలో అనుష్క..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *