OORపై ఘోర రోడ్డుప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు! ఏం జరిగిందంటే..

OORపై ఘోర రోడ్డుప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు! ఏం జరిగిందంటే..


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీకొన్న కారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తుక్కుగుడా నుండి గచ్చిబౌలి వైపు వెళుతుండగా తొండుపల్లి ఎక్సిట్ 16 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదాని గత కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం. కారుకు ముందు వెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి మరో వ్యక్తితో పాటు చిన్నారికి గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్ కు తరలించిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎక్సిట్ నెంబర్ 16 వద్ద మారుతి సుజుకి సియాజ్ కారు ప్రమాదానికి గురైంది. తుక్కుగుడా వైపు నుండి గచ్చిబౌలి వైపు వెళుతున్న కారు తొండుపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి ముందు వెళుతున్న గుర్తుతెలియని వాహనాని ఢీకొట్టింది. ప్రమాదంలో కారులోని ఓ వ్యక్తి సంఘటన స్థలంలో మృతి చెందాడు. మరో వ్యక్తి తోపాటు చిన్నారి గాయపడ్డరు.

క్షతగాత్రులను 108 వాహనంలో సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి గురైనా కారులో లగేజీ ఉండడంతో ఎక్కడో దూరం నుంచి ప్రయాణం చేస్తూ నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. అనంతరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఇందుకు సంబందించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా శంషాబాద్ ఔటర్ రింగ్ ప్రమాదాలకు అడ్డాగా మారుతుంది. గతంలోనూ ఇదే మార్గంలో పలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *