పవన్ కళ్యాణ్ నటిస్తున్న నయా మూవీ ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను విడుదల చేసిన టీజర్ పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం పేక్షకులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.. హరిహరవీరమల్లు సినిమా తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో ఓ సమురాయ్ లా కనిపించనున్నాడు. అలాగే ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కు భారీగా అభిమానులు తరలి వచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.