OG Movie: వేరే వాళ్ల మాటలు వినకండి.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే.. పవన్ కల్యాణ్ ‘ఓజీ’పై టాలీవుడ్ హీరోల రివ్యూ

OG Movie: వేరే వాళ్ల మాటలు వినకండి.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే.. పవన్ కల్యాణ్ ‘ఓజీ’పై టాలీవుడ్ హీరోల రివ్యూ


‘ఓజీ’ సినిమా రూపంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ముందుగానే దసరా పండగ వచ్చింది. గురువారం (సెప్టెంబర్ 24) రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్స్ పడగా, శుక్రవారం (సెప్టెంబర్ 25) రెగ్యులర్ షోస్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సామాన్య ప్రేక్షకులతో పాటు స్టార్ సెలబ్రిటీలు సైతం ఓజీ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అకీరానందన్, డైరెక్టర్ హరీశ్ శంకర్, నిర్మాత ఎస్కేఎన్ తదితరులు ఓజీ సినిమాను వీక్షించారు. పవన్ మూవీపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక న్యాచురల్ స్టార్ నాని కూడా ఓజీ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘వేరే వాళ్ల మాటలు వినకండి. ‘ఓజీ’ ఒరిజినల్ గెయింట్ బ్లాక్‌బస్టర్ అంతే. పవన్ కళ్యాణ్ గారు, సుజీత్, తమన్ మిగతా ‘ఓజీ’ టీమ్‌కి నా అభినందనలు’ అని విషెస్ చెప్పారు. ఇక మరో నిర్మాత నాగవంశీ కూడా ఓజీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఓజీ’ నిజంగానే ఫైర్ స్ట్రామ్ లా దూసుకెళుతోంది. ప్రతి క్షణం మాస్ మ్యాడ్‌నెస్‌తో నిండిపోయింది. పవన్ కల్యాణ్ ఇంట్రో సీన్ అద్దిరిపోయింది. ఇంటర్వెల్, పోలీస్ స్టేషన్ బ్లాక్స్ అయితే ప్యూర్ గూస్‌బంప్స్. ఎక్కడ చూసినా హై మూమెంట్స్ కనిపిస్తున్నాయి. పవర్‌స్టార్ స్వాగ్, ఆటిట్యూడ్ ఫ్యాన్స్ కు కన్నుల పండగే. మా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎమ్ ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసింది. నిజంగా రాంపేజ్. ఇప్పుడు హంగ్రీ చీతా వేట మొదలైంది. ‘ఓజీ’ టీమ్ మొత్తానికి అభినందనలు అని రాసుకొచ్చారు నాగ వంశీ.

టాలీవుడ్ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు ‘బిగ్ స్క్రీన్‌పై అసలైన ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ను అత్యంత ఆసక్తిగా చూసే అవకాశం దక్కింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్బ్. ఆయన్ని డైరెక్టర్ సుజీత్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. తమన్ మ్యూజిక్ గురించి మాటల్లో చెప్పలేం. నిజంగా ఇది బ్లాక్‌బస్టర్ మూవీ’. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఓజీపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

థియేటర్ లో మెగా మేనల్లుడి హంగామా..

నాని ట్వీట్..

నాగవంశీ పోస్ట్..

డైరెక్టర్ బాబీ రివ్యూ..

నిర్మాత ఎస్కేఎన్ రియాక్షన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *