పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 4 రోజులే ఉండడంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21) సాయంత్రం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ మెగా ఈవెంట్ కు వేదిక కానుంది. గతంలో విజయవాడలో ఈవెంట్ నిర్వహిస్తారనే ప్రచారం సాగినప్పటికీ ఫైనల్ గా హైదరాబాద్లో వెన్యూ ఫిక్స్ చేశారు. ఈ ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనుండగా… సాయంత్రం ఈవెంట్ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మెగా ఈవెంట్కు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఆయన షూటింగులో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి మెగాస్టార్ ఈ ఈవెంట్ కు రావడం అనుమానమేననిపిస్తోంది. తెలంగాణ సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ మెగా ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా రానున్నారని కూడా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఓజీ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ప్రతి కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. అలాగే సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరికాసేపట్లో ఓజీ ట్రైలర్..
Firing tomorrow at 10:08 AM. #OGTrailer #OG #TheyCallHimOG. pic.twitter.com/byHaoElwJM
— DVV Entertainment (@DVVMovies) September 20, 2025
అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్ము రేపుతోన్న పవన్ సినిమా..
#OG BLOOD BATH AT BOTH @district_india and @bookmyshow 🔥🔥🔥💥💥💥💥❤️🔥❤️🔥❤️🔥❤️🔥👌👌👌
Nearly 250K+ tickets sold across AP/TG 💥💥💥🔥🔥🔥🔥❤️🔥❤️🔥🥵🥵🥵
Power Star ⭐️ @PawanKalyan Mass Hysteria 💥💥🦁🦁🦁🔥🔥❤️🔥❤️🔥#TheyCallHimOG #PawanKalyan #OGTrailerDay #OGbooking #OGTrailer pic.twitter.com/oqesgQHX7f
— PawanKalyan Fan Page ™ 🧢 (@PSPKFanPageTeam) September 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.