పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతో అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ఇక ఇప్పుడు ఓజీ మూవీతో మరోసారి అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యారు. మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఓజీ మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించనుంది. సెప్టెంబర్ 21న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ OG సినిమా టికెట్కు రికార్డ్ ధర పలికింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో సినిమా టికెట్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో పవన్ అభిమాని ఆముదాల పరమేష్ బెనిఫిట్ షో తొలి టికెట్ ను లక్షా 29వేల 999 రూపాయలకు దక్కించుకున్నారు. ఆ టికెట్ డబ్బును జనసేన ఆఫీసుకు ఇస్తామని పరమేష్ చెప్పారు. పవన్ కల్యాణ్ OG సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.