OG Movie: పవన్ కళ్యాణ్ మాస్ క్రేజ్.. బాక్సాఫీస్ వద్ద ఓజీ మేనియా.. అడ్వాన్స్ బుకింగ్స్‏లో రికార్డ్స్..

OG Movie: పవన్ కళ్యాణ్ మాస్ క్రేజ్.. బాక్సాఫీస్ వద్ద ఓజీ మేనియా.. అడ్వాన్స్ బుకింగ్స్‏లో రికార్డ్స్..


మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పై భారీ హైప్ నెలకొంది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. డీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ జోడిగా ప్రియాంక మోహన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో పవన్, ప్రియాంక జోడి ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియ పూర్తైంది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

ఇదిలా ఉంటే.. ఓవర్సీస్ లో రికార్డులు సృష్టిస్తుంది ఓజీ. తాజాగా నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్ షో అడ్వాన్స్ బుకింగ్స్ 2 మిలియన్స్ దాటిపోయాయి.ఇందుకు సంబంధించి మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఓజీ ర్యాంపేజ్ కంటిన్యూ అవుతుందని.. ఓవర్సీస్ లో మరిన్ని రికార్డులు సృష్టించబోతుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. కానీ ఇప్పటికే అటు బాక్సాఫీస్.. ఇటు ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది ఓజీ.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

సెప్టెంబర్ 24న తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ఉన్నాయి. దీంతో ఒకరోజు ముందుగానే పవన్ అభిమానులకు పండగ వాతావరణం రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ అటు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హాష్మీ ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *