OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’లో నేను కూడా నటించాను.. కానీ ఎడిటింగ్‌లో లేపేశారు: టాలీవుడ్ హీరో

OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’లో నేను కూడా నటించాను.. కానీ ఎడిటింగ్‌లో లేపేశారు: టాలీవుడ్ హీరో


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో . ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్‌, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్,  వెంకట్ ఇలా భారీ తారగణమే ఓజీలో ఉంది. ఇక డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుందని సమాచారం. అయితే చాలా సినిమాల్లాగే ఓజీ సినిమాలోనూ కొన్ని సీన్లు ఎడిటింగ్ లో లేపేశారు. సినిమా నిడివి ఎక్కువైందనో, లేక సన్నివేశాలు సినిమాకు సెట్ అవ్వలేదో తెలియదు కానీ కొన్ని సన్నివేశాలను మాత్రం కత్తిరంచేశారు. అయితే ఈ ఎడిటింగ్ లో పోయిన సీన్స్ లో తాను ఉన్నానంటున్నాడు ఒక టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్. ఈ మేరకు అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది. ఇంతకీ ఓజీలో నటించి ఎడిటింగ్ లో కనిపించకుండా పోయిన ఆ నటుడు మరెవరో కాదు రాహుల్ రవీంద్రన్.

ఇవి కూడా చదవండి

సోమవారం రిలీజైన ఓజీ ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ పక్కన రాహుల్ రవీంద్రన్ కూడా కనిపించాడు. దీంతో చాలా మంది సినీ ఫ్యాన్స్ రాహుల్ గుర్తుపట్టి.. అందులో ఉన్నది మీరే కదా.. మీరు కూడా ఓజీలో నటించారా? అని సోషల్ మీడియా వేదికగా అడిగారు. దీనికి స్పందించిన రాహుల్ రవీంద్రన్.. ‘ఓజీలో నటించాను కానీ, ఎడిటింగ్ లో తీసేశారు’ అని చెప్పాడు. ‘హహా ఇలాంటి ట్వీట్లు చాలా వస్తున్నాయి. అవును అది నేనే. మొదట్లో ఇందులో చాలా ఆసక్తికరమైన పాత్ర చేశాను. కానీ చాలా కట్ చేయాల్సి వచ్చింది. సుజిత్ ని దగ్గరగా చూస్తూ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అతను తన విజువల్స్ ఎలా మలచాడో గమనించి నేర్చుకోవడం ఇంకా బావుంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది’ అని ప్రశంసలు కురిపించాడు రాహుల్.

రాహుల్ రవీంద్రన్ ట్వీట్..

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. తన సీన్స్ ఎడిటింగ్ లో లేపేసినా, స్పోర్టివ్ స్పిరిట్ తో సుజిత్ ను ప్రశంసించడం రాహుల్ మంచి తనానికి నిదర్శనమంటున్నారు నెటిజన్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *