ఎట్టకేలకు మెగా ఫ్యాన్స్ నీరిక్షణకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఓజీ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం (సెప్టెంబర్ 25న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. హరిహార వీరమల్లు సినిమా తర్వాత పవన్ నుంచి వచ్చిన గ్యాంగ్స్ డ్రామా ఇది. విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో బుధవారం అర్దరాత్రి ప్రీమియర్ షోస్ పడ్డాయి. పవర్ స్టార్ అభిమానులకు కిక్కి్చ్చే సినిమా తీసుకువచ్చాడంటూ సోషల్ మీడియాలో సంబరాలు స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. ఈ క్రమంలో డైరెక్టర్ సుజీత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓజీ సినిమా గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలాగే సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ పై హింట్ సైతం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
సుజీత్ పోస్టులో.. “They Call Him OG మీ ముందుకు వస్తుంది. ఎన్నో సంవత్సరాల ఈ ప్రయాణం చివరకు ముగిసింది. ఓవైపు ఉత్సాహంగా, మరొవైపు బాధగా కూడా ఉంది. ప్రతి అడుగులో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా డైరెక్షన్ టీంకు, టెక్నిషియన్ కు ఐ లవ్ యూ. ఇంతకంటే ఏం చెప్పలేను. ప్రతి కష్టంలో మీరు నాకు తోడుగా ఉన్నారు. ఎప్పుడూ నన్ను నమ్మి.. నాకు అండగా నిలబడిన నిర్మాతలు దానయ్య, కళ్యాణ్ దాసరికి ధన్యవాదాలు. ఈ సినిమా ఎప్పటికీ మద్దతుగా నిలిచి తన వద్ద ఉన్నవన్ని ఇచ్చిన థమన్ అన్నకు థ్యాంక్స్. నవీన్ నూలి బ్రో.. అడియన్స్ మీ మ్యాజిక్ ను తెరపై చూసే వరకు వేచి ఉండలేకపోతున్నాను. ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్ నెస్ ఊహించలేనిది. గుర్తుపెట్టుకోండి. ఇది ఆరంభం మాత్రమే. అన్నీ సరిగ్గా కుదిరితే ఓజీ ప్రపంచం ఇక్కడి నుంచి మరింత పెద్దదిగా మారుతుంది. లవ్ యు మై పవర్ స్టార్ ” అంటూ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
అంతేకాదు తన పోస్టులో ‘Storming in Cinemas Near U’ అంటూ SCUని హైలెట్ చేశారు. సినిమాటిక్ యూనివర్స్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓజీ చిత్రానికి తెల్లవారుజామున నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తుంది. ఈ చిత్రంలో పవన్ యాక్టింగ్, మేనరిజం, స్టైలీష్ హైలెట్ అయ్యాయని.. డైరెక్టర్ సుజీత్ మేకింగ్ అదిరిపోయిందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..
డైరెక్టర్ సుజీత్ పోస్ట్..
Storming in Cinemas near U…🧿♥️#OG #TheyCallHimOG pic.twitter.com/Bb7aYIeiTJ
— Sujeeth (@Sujeethsign) September 24, 2025
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..