పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఓజీ సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఓజీ మూవీలో భారీ తారాగణమే ఉంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తే, బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుహాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు ఇలా ఎందరో స్టార్స్ ఓజీలో వివిధ పాత్రల్లో మెరిశారు. ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ చిన్నప్పటి పాత్ర కూడా ఉంది. జపాన్ లో సమురాయ్ లతో ఉండే పవన్ ఇండియాకు ఎలా వచ్చాడు అనే కథతో ఈ సినిమా మొదలవుతుంది.
ఓజీ రిలీజ్ కు ముందు పవన్ కల్యాణ్ చిన్నప్పటి పాత్ర పవన్ తనయుడు అకిరా నందన్ చేస్తాడని చాలా మంది భావించారు. కానీ అదేమీ జరగలేదు. అయితే ఈ పాత్రలో అదరగొట్టే యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు ఆకాష్ శ్రీనివాస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ కుర్రాడు ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాల్లో మెరిశాడు. రంగరంగ వైభవంగా, నాంది, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీశ్, బంగార్రాజు, రామారావు ఆన్ డ్యూటీ, పొన్నియన్ సెల్వన్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కిలోనూ డార్లింగ్ చిన్నప్పటి పాత్రను కూడా ఆకాశే పోషించాడు. దీంతో ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఒక్కసారిగా వైరలయ్యాడు.
ఇవి కూడా చదవండి
ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ చిన్నప్పటి రోల్ లో సూపర్బ్ గా యాక్ట్ చేశాడు ఆకాశ్. జపాన్ మార్షల్ ఆర్ట్స్ తో ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా చేసాడు. దీంతో నెట్టింట ఈ కుర్రాడి పేరు మార్మోగిపోతోంది. ఓజీ సినిమా సక్సెస్ తో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు ఆకాశ్. సోషల్ మీడియాలోనూ ఈ కుర్రాడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
కల్కి సినిమా సెట్ లో దుల్కర్ సల్మాన్ తో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.