
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. . బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఓమీ గా విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ టైమ్ కూడా దగ్గరపడింది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఓజీ సినిమాను రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21) సాయంత్రం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అయితే అంతకన్నా ముందే ఉదయం 10.08 గంటలకు ఓజీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో పవన్ అభిమానులు వెయ్యి కళ్లతో ట్రైలర్ కోసం వెయిట్ చేశారు. కానీ ఓజీ టీమ్ పవన్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసింది. ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
పవన్ కళ్యాణ్ నటించిన `గబ్బర్ సింగ్` సినిమాలోని సీన్‌ని పోస్ట్ చేసి, తమపైనే సెటైర్లు వేసుకుంటూ `ఓజీ` ట్రైలర్ వాయిదా విషయాన్ని వెల్లడించడం విశేషం. ఓకే ఓకే మ్యూజిక్ స్టార్ట్ రిప్లైస్, కోట్స్ అంటూ సాయంత్రం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓజీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఆదివారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లోనే ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు డిజప్పాయింట్ అవుతున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఓజీ ట్రైలర్..
Ok Ok. Music start in replies and quotes… . #OGTrailer will be released today at the #OGConcert event. pic.twitter.com/oFQOMI0n46
— DVV Entertainment (@DVVMovies) September 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.