నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ది నేషన్ (NSN) కరాటే లీగ్‌ను కరాటే ఇండియా ఆర్గనైజేషన్ (KIO), తెలంగాణ స్టేట్ కరాటే-డో అసోసియేషన్ (TSKDA) ఆమోదించింది. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ (KIO) వరల్డ్ కరాటే ఫెడరేషన్ (WKF), ఆసియన్ కరాటే ఫెడరేషన్ (AKF) లతో అనుబంధంగా ఇది పనిచేయనుంది. ఈ రెండూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)చే గుర్తింపు పొందాయి.
కాగా, NSN కరాటే లీగ్ దేశంలోనే అత్యుత్తమ కరాటే టోర్నమెంట్లలో ఒక ప్రధాన జాతీయ స్థాయి వేదికగా నిలవనుంది. భారతదేశంలోని రాబోయే కరాటే స్టార్ల కోసం దీనిని రూపొందించారు. విద్యార్థులు, అథ్లెట్లకు జాతీయ వేదికపై వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇది అందించనుంది.
ఈ పోటీలో సబ్-జూనియర్స్, క్యాడెట్స్, జూనియర్స్, అండర్-21, సీనియర్స్ విభాగాలు ఉంటాయి. విజేతలకు ట్రోఫీలు అందజేయనున్నారు. ఎంపిక చేసిన విభాగాలకు నగదు బహుమతులు కూడా అందించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ వేదిక ద్వారా, విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పోటీ అనుభూతితో పాటు విలువైన అనుభవాన్ని పొందుతారు. అసాధారణ ప్రదర్శనకారులు గుర్తించి, భవిష్యత్ అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయవచ్చు.
హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వలన ప్రత్యేక ఆకర్షణ లభిస్తుంది. పాల్గొనేవారికి పోటీతోపాటు థ్రిల్‌ను మాత్రమే కాకుండా, శాశ్వత జ్ఞాపకాలను సృష్టించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.
లీగ్‌తో తన అనుబంధం గురించి సిద్ధు రెడ్డి కందకట్ల మాట్లాడుతూ, “ఒక సామాజిక కార్యకర్తగా, నేను ఎల్లప్పుడూ యువతకు సాధికారత కల్పించడంలో నమ్మకం ఉంచాను. పిల్లల విద్యను బలోపేతం చేయడానికి పాఠశాలలను నిర్మించడానికి నేను కృషి చేశాను. విద్యారంగంలోనే కాకుండా క్రీడలలో, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా యువ ప్రతిభను నేను గట్టిగా సమర్థిస్తాను. మన తదుపరి తరం జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రకాశిస్తుందని చూడటం నాకు చాలా ఇష్టం, NSN కరాటే లీగ్‌లో భాగమైనందుకు నాకు గౌరవం ఉంది” అని తెలిపాడు.
NSN కరాటే లీగ్ నిర్వాహకులు మాట్లాడుతూ “సీజన్ 1 బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీ సిద్ధు రెడ్డి కందకట్లను స్వాగతిస్తున్నందుకు మేం గర్విస్తున్నాం. విద్య, యువత సాధికారత, క్రీడల పట్ల ఆయన అంకితభావం NSN దార్శనికతను ప్రతిబింబిస్తుంది. దేశంలోని తదుపరి తారలను కనుగొనడం మాకు సంతోషంగా ఉంది. భారతదేశంలో అత్యంత పోటీతత్వం, స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయమైన కరాటే ఈవెంట్‌లలో ఒకదాన్ని సృష్టించడానికి మేం ఎదురుచూస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..