Navratri Day1: శరన్నవరాత్రులు ప్రారంభం.. ఇంద్రకీలాద్రిపై బాలత్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం.. పోటెత్తిన భక్తులు

Navratri Day1: శరన్నవరాత్రులు ప్రారంభం.. ఇంద్రకీలాద్రిపై బాలత్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం.. పోటెత్తిన భక్తులు


దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు దుర్గాదేవిని బాల త్రిపుర సుందరిగా, శైల పుత్రికగా పూజిస్తున్నారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ కొలువైన క్షేత్రం ఇంద్రకీలాద్రిపై కూడా నేటి నుండి దసరా శరణవరాత్రులు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు.

బాలాత్రిపురసుందరి అంటే..

శారదా నవరాత్రుల్లో అమ్మవారిని నవ దుర్గలుగా రెండు సాంప్రదాయాల ప్రకారం పూజిస్తారు. మొదటి సాంప్రదాయం పురాణోక్తం. ఈ సంప్రదాయం ప్రకారం అమ్మవారిని పూజించేవారు మొదటి రోజున బాలాత్రిపురసుందరిగా భావిస్తారు. అమ్మవారిని పూజిస్తారు. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి.. త్రిపురుడు అంటే ఈశ్వరుడి.. కనుక ఆయన భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. త్రిపుర సుందరి అంటే ” మనలోని ముడు అవస్థలు జాగృత్త్, స్వప్న, సుషుప్తి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో.. అక్షమాల ధరించిన అమ్మవారిని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు బాలత్రిపుర సుందరి అధిష్ఠన దేవత. కనుక ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.

ఇవి కూడా చదవండి

బాల త్రిపుర సుందరిని పూజించడం ప్రాముఖ్యత

సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవిని భక్తులు పూజిస్తారు.

పూజ చేయడం ద్వారా జీవితంలో స్థిరత్వం.. విజయం లభిస్తుంది.

పితృ దోషం .. చంద్రునికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.

భక్తుల మనస్సులో విశ్వాసం.. ధైర్యం నింపబడతాయి.

తల్లి ఆశీస్సులతో కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు నిలిచి ఉంటాయి

ఈ రోజు రెండు నుంచి పది సంవత్సరములు లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపముగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి.

అమ్మవారికి పాయసం నివేదన చెయ్యాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *