భారతదేశంలోని ప్రధాన పండుగలలో దసరా( విజయదశమి) నవరాత్రి వేడుకలు కూడా ఒకటి. మన దేశంలో ఈ పండుగను 11 రోజుల పాటు అంగరంగవైభంగా జరుపుకుంటారు. ఇక మన తెలంగాణలో ఐతే బుతుకమ్మ ఆటలతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పండగలు చేసుకుంటారు. అయితే ఈ పండగల సమయాల్లో ఇంట్లోకి బంగారం, లేదా ఇతర వస్తువు ఏవైనా కొనాలని చాలా మంది అనుకుంటారు. ఇలా పండగ పూట బంగారం కొనడం వల్ల అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. అయితే నవరాత్రులు సమయంలో బంగారం కొనడం మంచిదేనా అనేది పరిశీలిద్దాం
నవరాత్రి సమయంలో బంగారం కొనవచ్చా?
నవరాత్రి సమయంలో బంగారం కొనడం హిందూ సంప్రదాయంలో శుభకరంగా భావిస్తారు, ముఖ్యంగా దసరా (విజయదశమి) రోజున. ఈ సమయంలో బంగారం కొనుగోలు సంపద, శ్రేయస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులను తెస్తుందని నమ్ముతారు. కొత్త బంగారు ఆభరణాలు కొనడం వల్ల మహిళల జీవితాల్లో శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అయితే, కొనడానికి ముందు కొన్ని ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం
ధర పెరగవచ్చు: నవరాత్రి సమయంలో మార్కెట్ బంగారం ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ధరలు కొంత పెరగవచ్చు. కొనుగోలు చేసే ముందు బంగారం ధరలను పోల్చి చూడండి. బంగారం కొనడం సంప్రదాయం, విశ్వాసంలో ఒక భాగమైనప్పటికీ, మార్కెట్‌ను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.
మీ బడ్జెట్ చూసుకోండి: మీ ఆర్థిక స్థితిని బట్టి బంగారం కొనడం ప్లాన్ చేయండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. మరో ముఖ్య విషయం హాల్‌మార్క్ ఉన్న బంగారం కొనడం ద్వారా నాణ్యతను నిర్ధారించుకోండి.
బంగారంలో పెట్టుబడి: బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చాలా మంది పరిగణిస్తారు. ఆర్థిక అస్థిరత లేదా మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో బంగారం స్టాక్ లాగా పనిచేస్తుంది. కానీ ధరలు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడతాయి. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకోండి.
గమనిక: సంప్రదాయపరంగా నవరాత్రి పండుగ బంగారం కొనడానికి మంచి సమయం అయినప్పటికీ, మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, మార్కెట్ స్థితిగతులను బట్టి మీరు బంగారం కొనాలో వద్దో అనే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.