ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టిన మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో తాను ఉపయోగించిన క్యాప్‌ను లోకేష్ అన్నకు ప్రేమతో ఇస్తున్నానని తిలక్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో తిలక్ వర్మ క్యాప్‌పై తన సైన్ చేసి మంత్రి లోకేష్ పేరును రాయడం మనం చూడవచ్చు.
ఇక తిలక్ వర్మ పోస్ట్‌ను చూసిన మంత్రి లోకేష్ స్పందిస్తూ తమ్ముడు తిలక్ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకమైందని చెప్పుకొచ్చాడు. నువ్వు భారత్‌కు తిరిగి వచ్చాక స్వయంగా నీ చేతుల మీదుగానే క్యాప్ తీసుకుంటా అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అలాగే తిలక్ వర్మ క్యాప్‌పై సంతకం చేస్తున్న వీడియోను లోకేశ్ షేర్ చేశారు.
వీడియో చూడండి..
This made my day, tammudu! 😍 Excited to get it straight from you when you’re back in India, champ!#AsiaCup2025 @TilakV9 pic.twitter.com/hsdEljJ2lS
— Lokesh Nara (@naralokesh) September 29, 2025
ఇదిలా ఉండగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. 147 పరుగలు లక్ష్య చేధనలో బరిలోకి దిగన భారత్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసి 9వసారి టైటిల్ సాధించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. 53 బంతులు 4 ఫోర్లు, 2 సిక్సులు 69 పరుగులు సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.