MSG @ 50 Days: 109 సెంటర్స్.. 50 డేస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు 50 రోజుల పోస్టర్ చూసాం బాబోయ్..!

MSG @ 50 Days: 109 సెంటర్స్.. 50 డేస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు 50 రోజుల పోస్టర్ చూసాం బాబోయ్..!


ఒకప్పుడు ఏ సినిమా పోస్టర్ చూసినా ‘100 డేస్’, ’50 డేస్’ అనే కలర్‌ఫుల్ అక్షరాలు కనిపించేవి. ఆ రోజుల్లో థియేటర్లలో ఇన్ని రోజులు సినిమా ఆడటం అనేది ఇండస్ట్రీకి, ఫ్యాన్స్‌కి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. కానీ ఎప్పుడైతే OTT యుగం మొదలైందో.. ఆ బాక్సాఫీస్ లెక్కలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బట్టే డిసైడ్ అయిపోతోంది. ఒక వారం, మహా అయితే రెండు వారాలు ఆడితే అదే పెద్ద సక్సెస్ అనుకునే పరిస్థితికి వచ్చేశాం. ఒక సినిమా థియేటర్లలో 20 రోజులు నిలబడటమే ఒక గగనంగా మారిపోయిన ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్‌లో, లాంగ్ రన్ అనే కాన్సెప్ట్ కనుమరుగైపోయింది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో ఎన్నో ఏళ్లుగా మనం మర్చిపోయిన ‘సెంటర్స్’, ‘డేస్’ అనే మాటలను మళ్లీ బలంగా వినిపించింది మన శంకరవరప్రసాద్ గారు సినిమా. సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమా ఏకంగా 109 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పుడంతా ఫస్ట్ వీక్ గ్రాస్, పాన్ ఇండియా షేర్ గురించే మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో.. ఒక సినిమా ఇన్ని సెంటర్లలో హాఫ్ సెంచరీ కొట్టడం మామూలు విషయం కాదు. ఈ రికార్డ్ చూశాక అభిమానుల్లో, డిస్ట్రిబ్యూటర్లలో పాత రోజుల నాటి ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా బతికే ఉందని, కంటెంట్ ఉంటే జనాలు థియేటర్లకు వస్తారని ఈ విజయం గట్టిగా ప్రూవ్ చేసింది. అయితే ఈ థియేట్రికల్ లాంగ్ రన్ మళ్లీ రిపీట్ కావడానికి కేవలం సినిమా కంటెంట్ మాత్రమే కాదు, తెరవెనుక జరుగుతున్న మరో ఆసక్తికరమైన చర్చ కూడా ప్రధాన కారణం అవుతోంది. అదే 8 వారాల ఓటీటీ గ్యాప్. గతంలో సినిమాలు రిలీజైన మూడు నాలుగు వారాలకే ఇంకా చెప్పాలంటే.. కొన్నిసార్లు అంతకంటే ముందే ఓటీటీల్లోకి వచ్చేయడంతో, జనాలు థియేటర్లకు వెళ్లడం బాగా తగ్గించారు.

ఎలాగూ నెల రోజుల్లో మన ఫోన్లోనో లేదంటే టీవీలో వస్తుంది కదా.. ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూద్దాం అనే మైండ్‌సెట్ ఆడియన్స్‌లో ఫిక్స్ అయిపోయింది. ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడానికి థియేట్రికల్ రిలీజ్‌కి, ఓటీటీ రిలీజ్‌కి మధ్య కనీసం 8 వారాల గ్యాప్ కచ్చితంగా ఉండాలనే రూల్‌ను మన ఇండస్ట్రీ వాళ్లు సీరియస్‌గా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ 8 వారాల రూల్ కనక పక్కాగా అమలైతే.. బాక్సాఫీస్ దగ్గర మళ్లీ పాత రోజులు చూసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఓటీటీలో సినిమా రావడానికి చాలా టైమ్ పడుతుంది అని తెలిస్తే, పాజిటివ్ టాక్ వచ్చిన ఏ సినిమానైనా సరే జనాలు థియేటర్లలోనే చూడటానికి ఇష్టపడతారు. ఇప్పటికే హిందీ, మలయాళంలో ఇదే జరుగుతుంది. అందుకే ధురంధర్ లాంటి సినిమాలు 50 రోజుల వరకు కలెక్షన్లు తెచ్చాయి. అలాగే కేరళలో లోక అనే సినిమా 100 రోజులు ఆడింది.

ఇదే తెలుగులో రిపీట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. దీనివల్ల ఆటోమెటిక్‌గా థియేటర్లలో ఫుట్‌ఫాల్స్ పెరుగుతాయి. వీకెండ్స్ దాటాక కూడా జనాలు వస్తుంటే థియేటర్ల ఓనర్లు సినిమాలను తీసేయరు. అలా నాచురల్‌గా సినిమాల లాంగ్ రన్ పెరిగి.. మళ్లీ 50 రోజుల పోస్టర్లు మన కళ్ల ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. మన శంకరవరప్రసాద్ గారు సినిమా సాధించిన ఈ 50 రోజుల రికార్డ్ కేవలం ఒక మిరాకిల్ కాదు.. భవిష్యత్తు బాక్సాఫీస్ ట్రెండ్‌కి ఒక పాజిటివ్ ఇండికేషన్. కంటెంట్ బాగుండి, ఓటీటీ రిలీజ్ గ్యాప్ 8 వారాలు స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తే.. వారం, రెండు వారాలకే థియేటర్ల నుంచి సినిమాలు కనుమరుగయ్యే ట్రెండ్‌కి చెక్ పెట్టొచ్చు. సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. సరైన రూల్స్, మంచి కంటెంట్ ఉంటే.. టాలీవుడ్‌లో మళ్లీ పాత రోజుల నాటి థియేట్రికల్ సెలబ్రేషన్స్ చూడటం గ్యారెంటీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *