చుండ్రును సాధారణ సమస్యగా భావించి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ చుండ్రు క్రమంగా తలలో ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలడానికి దారితీస్తుందని మీకు తెలుసా? దీని వల్ల భవిషత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను మొదట్లోనే పరిష్కరించుకోవడం ముఖ్యం. కాబట్టి వర్షంలో తడిసిన వెంటనే మీరు మీ జుట్టును శుభ్రంగా కడుక్కోని పూర్తిగా ఆరబెట్టుకోండి. తడి జుట్టుకు రబ్బర్ బ్యాండ్స్ వేసి కట్టకండి, ఎందుకంటే ఇది ఫంగస్ పెరగడానికి దారితీస్తుంది. మీ జుట్టును సహజంగా ఆరనివ్వడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు హెయిర్ డ్రైయర్‌ని ఉపయోగించే బదులు, టవల్‌తో మెల్లగా ఆరబెట్టి గాలిలో ఆరనివ్వండి.
చుండ్రు సమస్యను ఈ చిట్కాలతో పరిష్కరించుకోండి
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి మీ తలకు మసాజ్ చేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. ఇది చుండ్రును తగ్గిస్తుంది. అలాగే తలకు తేమను అందిస్తుంది.
అలోవెరా జెల్: తాజా కలబంద జెల్ తీసుకొని మీ తలకు అప్లై చేయండి. అరగంట పాటు అలాగే ఉంచి, తర్వాత మీ జుట్టును శుభ్రం చేసుకోండి. ఇది తలలో చికాకు, చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన భాగాలుగా కలిపి తలస్నానం చేసే ముందు తలకు పట్టించి 15 నిమిషాల ఉంచండి. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కోండి. ఇది చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుదలను సహాయపడుతుంది.
మెంతులు: మెంతుల గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్ట్ లా చేసి తలకు అప్లై చేయండి. అరగంట తర్వాత జుట్టు కడుక్కోవడం వల్ల చుండ్రు, దురద తొలగిపోతాయి. ఇది మీ జుట్టుకు పోషణనిస్తుంది.
టీ ట్రీ ఆయిల్: మీ షాంపూలో టీ ట్రీ ఆయిల్ కలిపి మీ తలకు అప్లై చేయండి. ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను తగ్గిస్తుంది. ఇది సహజంగా చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ తలని శుభ్రపరుస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.