వేసవి కాలం తర్వాత వచ్చే వర్షాకాలం మనకు చల్లదనాన్ని తెస్తుంది. చాలా మంది ఇప్పటికీ తమ బెడ్‌రూమ్‌లలో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ACని ఉపయోగిస్తారు. అయితే నిజానికి వర్షాకాలంలో ACని ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే వర్షా కాలం వచ్చినా ఇప్పటీ చాలా మంది వేసవిలో వాడినట్టు 18 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు ఏసీని ఉపయోగిస్తారు. కానీ ఈ మేరకు దీనిని ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వర్షా కాలంలో ఏసీని ఎన్ని డిగ్రీల వద్ద ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఏ ఉష్ణోగ్రత వద్ద ఉపయోగించడం ఉత్తమం?
వేసవిలో లాగా 18 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వర్షాకాలంలో దీనిని ఉపయోగించడం మంచిది కాదు. సాధారణంగా, వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అదే ఉష్ణోగ్రత వద్ద ACని నడపడం వల్ల విద్యుత్ వినియోగం పెరగడమే కాకుండా, మీకు జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వర్షాకాలంలో, AC ఉష్ణోగ్రతను 24 డిగ్రీల నుండి 26 డిగ్రీల మధ్య ఉంచడం మంచిది. ఈ పరిధిలో ఉపయోగించడం ద్వారా, గదిలో తేమ నియంత్రణలో ఉంటుంది.
24 డిగ్రీల నుండి 26 డిగ్రీల ఉష్ణోగ్రతను ఉపయోగించడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. AC బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే ఏసీని తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాడడం వల్ల గది వేగంగా చల్లబడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ వర్షాకాలంలో, AC వేడిని మాత్రమే కాకుండా తేమను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, ఉష్ణోగ్రతను చాలా చల్లగా ఉంచడం వలన ACపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.
అధిక విద్యుత్ బిల్లులు వచ్చే అవకాశాలు
వర్షాకాలంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. అందుకే నిరంతరం ఏసీని నడపాల్సిన అవసరం లేదు. పగటిపూట కొన్ని గంటలు దాన్ని నడపవచ్చు. ఏసీని నడుపుతున్నప్పుడు, ఇంట్లో కిటికీలు, తలుపులను సరిగ్గా మూసివేయండి. ఇది తక్కువ సమయంలో మంచి చల్లదనాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది. మీకు అవసరమైన చల్లదనం వచ్చిన తర్వాత దాన్ని ఆపివేయడం మంచిది. విద్యుత్ బిల్లులను తగ్గించడానికి ఇది కూడా ఒక మార్గం.
మరిన్ని హ్యూమన్ ఇంటస్ట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి