ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ కళామతల్లికి ఆయన సేవలను గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందజేయనున్నట్లు శనివారం (సెప్టెంబర్ 20) కేంద్ర సమాచార, ప్రసారశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్‌లాల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మోహన్ లాల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ప్రముఖ నటులు మోహన్‌లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరం. మోహన్‌లాల్ కి హృదయపూర్వక అభినందనలు. అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే నటుడాయన. కథానాయకుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఐదు జాతీయ అవార్డులు పొందారు. తెలుగులో ఆయన నటించిన సినిమాలు తక్కువేగానీ అనువాద చిత్రాల ద్వారా మన ప్రేక్షకులను మెప్పించారు. ఇద్దరు, కంపెనీ, తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ లాంటివి తెలుగు వారికి బాగా గుర్తుండిపోతాయి. మోహన్ లాల్ మరిన్ని విభిన్న పాత్రలు పోషించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
పవన్ కల్యాణ్ ట్వీట్..
శ్రీ @Mohanlal గారికి అభినందనలు.
– @PawanKalyan #DadasahebPhalkeAward pic.twitter.com/8yzVLDiuF0
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 20, 2025
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ, మోహన్ లాల్ స్నేహితుడు మమ్ముట్టితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సూపర్ స్టార్ కు అభినందనలు తెలియజేశారు.
ప్రధాని మోడీ అభినందనలు..
Shri Mohanlal Ji epitomises excellence and versatility. With a rich body of work spanning decades, he stands as a leading light of Malayalam cinema, theatre and is deeply passionate about the culture of Kerala. He has also delivered remarkable performances in Telugu, Tamil,… https://t.co/4MWI1oFJsJ pic.twitter.com/P0DkKg1FWL
— Narendra Modi (@narendramodi) September 20, 2025
శశి థరూర్ ట్వీట్..
Wonderful news for all fans and admirers of @Mohanlal ! As an MP I am proud to lay claim to representing his city…: Congratulations to Kerala’s pride, our very own Lal! https://t.co/5N3CLmLAkB
— Shashi Tharoor (@ShashiTharoor) September 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.